close

తాజా వార్తలు

ఊహించలేదు.. వీడియో చూసి ఏడ్చా: రష్మిక

ఏం చేశానని ఇంత ప్రేమకు

ఊహించలేదు.. వీడియో చూసి ఏడ్చా: రష్మిక

హైదరాబాద్‌: ‘ఛలో’ సినిమాతో కథానాయికగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ రష్మిక. తర్వాత ‘గీత గోవిందం’లో కనిపించిన ఈ భామకు కుర్రకారులో విపరీతమైన క్రేజ్‌ ఏర్పడింది. ఈ సినిమాకు ఉత్తమ నటిగా రష్మిక ఇటీవల ‘జీ సినిమా’ అవార్డు అందుకున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులు రష్మిక కోసం ఓ ప్రత్యేకమైన వీడియోను రూపొందించారు. ‘గీత గోవిందం’ ఆడియో ఫంక్షన్‌ వీడియోను, ఓ ఇంటర్వ్యూ వీడియోను, సినిమాలో ఆమె స్టిల్స్‌ను కలిపి దీన్ని రూపొందించారు. ఈ వీడియోను రష్మిక ఫ్యాన్స్‌ ట్విటర్‌లో షేర్‌ చేస్తూ ఆమెకు ట్యాగ్‌ చేశారు. దీన్ని చూసిన ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

‘నేను ఏ మాత్రం ఊహించలేదు. ఈ ఎడిట్‌ చూస్తున్నప్పుడు ఏడ్చేశాను. ఏం చేశానని ఇంత ప్రేమకు నేను అర్హురాలినో తెలియదు కానీ.. మీలా ప్రోత్సహించే వారు నా చుట్టూ ఉన్నందుకు గర్వంగా ఉంది. నాకు చాలా ఆనందంగా ఉంది. కన్నీరు ఆగట్లేదు. ఐ లవ్‌ యు సో మచ్‌ గాయ్స్‌’ అని రష్మిక ట్వీట్‌ చేశారు.

రష్మిక ‘దేవదాస్‌’ సినిమాతో గత ఏడాది సెప్టెంబరులో హిట్‌ అందుకున్నారు. ప్రస్తుతం ఆమె ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రంలో విజయ్‌ దేవరకొండ సరసన నటిస్తున్నారు. భరత్‌ కమ్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యశ్‌ రంగినేని నిర్మిస్తున్నారు. జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతం అందిస్తున్నారు. మరోపక్క రష్మిక కన్నడలో రెండు సినిమాల్లో నటిస్తున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.