
తాజా వార్తలు
హైదరాబాద్: సమాచార యవనికపై అద్భుతాలతో వార్తా ప్రియులకు కొత్త అనుభూతి పంచే ఈటీవీ భారత్ యాప్ అందుబాటులోకి వచ్చింది. ఆంగ్ల భాష యాప్‌ను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఆంధ్రప్రదేశ్ యాప్‌ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. తెలంగాణ యాప్‌ను రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు ప్రారంభించారు. ఇతర రాష్ట్రాల యాప్‌లను ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు ప్రజలకు పరిచయం చేశారు. సాంకేతికతలో ఎప్పుడూ ముందుండే ‘ఈనాడు’.. డిజిటల్ ప్రపంచంలో మరిన్ని అద్భుతాలు సృష్టించాలని నేతలు, ప్రముఖులు ఆకాంక్షించారు. యాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ రామ్మోహన్ రావు, ‘ఈనాడు’ ఎండీ సీహెచ్ కిరణ్, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి తదితరులు పాల్గొన్నారు. యాప్ స్టోర్, గూగుల్ ప్లేస్టోర్ ద్వారా ఈటీవీ భారత్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
విజయం సాధించాలి: ఉపరాష్ట్రపతి
ఈటీవీ భారత్ యాప్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. నాలుగు దశాబ్దాల క్రితం ప్రారంభమైన ‘ఈనాడు’ మీడియాలో కొత్తదనానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఈటీవీ భారత్ ద్వారా గ్రామీణ భారతంపై దృష్టి కేంద్రీకరించడం ఆనందంగా ఉందన్నారు. యాప్‌నకు ‘ఈటీవీ భారత్’ అని పేరు పెట్టడం బాగుందని చెప్పారు. యాప్ విజయం సాధించాలని ఆకాంక్షించారు.
వినూత్న ప్రయోగం: చంద్రబాబు
యాప్‌ను తీసుకు రావడం వినూత్న ప్రయోగమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఏ సమాచారం కోసమైనా స్మార్ట్‌ఫోన్‌పై ఆధారపడాల్సి వస్తోందన్నారు. ఇలాంటి సమయంలో అన్ని భాషల వార్తా విశేషాలను ఒకే యాప్‌లో అందించడం శుభ పరిణామమన్నారు. ఇలాంటి ప్రయోగాలు రామోజీ గ్రూప్‌కే సాధ్యమని కొనియాడారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- ఆ ‘ఈగ’ పరమ అసహ్యంగా ఉంది!
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ఆ ఉరితాళ్లు.. నిర్భయ దోషులకేనా?
- విశ్వసుందరి.. జోజిబిని టుంజీ
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయా?
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- గుర్రమెక్కుతుంటే బాదేశారు... తాళి కడుతుంటే ఆపేశారు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
