close

తాజా వార్తలు

Updated : 07/08/2019 01:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇదో ఆల్‌రౌండర్‌!

రివ్యూ రింగ్‌

ఎక్కువ సమయం బ్యాటరీ.. హెచ్‌డీ డిస్‌ప్లే.. స్నాప్‌డ్రాగన్‌ ప్రాసెసర్‌.. కావాల్సినంత స్టోరేజ్‌ సామర్థ్యం.. ఆకట్టుకునే లుక్‌తో ఫోన్‌ని కొనాలంటే? తక్కువలో తక్కువ.. పదివేలు పెట్టాల్సిందే అనుకుంటాం. కానీ, అంత బడ్జెట్‌ అక్కర్లేదంటూ షామీ కంపెనీ మధ్య తరగతి యూజర్లకు ‘రెడ్‌మీ 7ఏ’ అందిస్తోంది. చూడ్డానికి హై ఎండ్‌ స్మార్ట్‌ఫోన్‌లా తీర్చిదిద్దారు. చేతిలో చక్కగా అమరుతుంది. బ్యాక్‌ ప్యానల్‌ని పలు రంగుల్లో (నీలం, నలుపు, బంగారం) అందించడం దీంట్లోని మరో ప్రత్యేకత. 9.5 ఎంఎం మందం, రౌండ్‌ కార్నర్స్‌తో ఫోన్‌ దృఢంగా కనిపిస్తుంది. స్పీకర్లను మైక్రో యూఎస్‌బీ పోర్టుకి రెండు వైపులా ఏర్పాటు చేశారు. దీంతో ఫోన్‌ని ఎలా పెట్టినా మ్యూజిక్‌ స్పష్టంగా వినిపిస్తుంది. కుడివైపు పవర్‌ బటన్‌ పక్కనే వాల్యూమ్‌ కంట్రోల్స్‌ ఉన్నాయి. ఎడమవైపు టూ ప్లస్‌ వన్‌ కార్డు స్లాట్‌లో రెండు నానో సిమ్‌లతో పాటు మైక్రో ఎస్‌డీ కార్డుని పెట్టుకోవచ్చు. 256జీబీ వరకూ స్టోరేజ్‌ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఫోన్‌తో పాటు వచ్చే ఇంటర్నల్‌ మెమొరీ 16జీబీ. వాడుకునేందుకు 10 జీబీ మిగులుతుంది. తెర పరిమాణం 5.45 అంగుళాలు. రిజల్యూషన్‌ 720*1440 పిక్సల్స్‌. స్నాప్‌డ్రాగన్‌ 439 ఆక్టా-కోర్‌ ప్రాసెసర్‌తో మెరుపు వేగంతో అప్లికేషన్స్‌ని ప్రాసెస్‌ చేస్తుంది. ర్యామ్‌ 2జీబీ. కెమెరాల విషయానికొస్తే.. వెనక సోనీ సెన్సర్‌తో 12 మెగాపిక్సల్‌ ఉంది. ముందు సెల్ఫీ కెమెరా సామర్థ్యం 5 మెగాపిక్సల్‌. ఫేస్‌ అన్‌లాక్‌తో ఫోన్‌ని సురక్షితంగా వాడుకోవచ్చు. దేశీయ మార్కెట్‌లో రెండేళ్ల వారెంటీతో రెడ్‌మీ ఫోన్‌ని అందించడం ఇదే తొలిసారి.

* ధర రూ.5,999


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని