close
ప్రధాని మోదీకి ఉన్న క్రేజ్‌ఇదే!

న్యూయార్క్‌: భారత ప్రధాని నరేంద్ర మోదీకున్న క్రేజ్‌ ఏ పాటిదో తెలిసిందే. ఆయన తన అద్భుత ప్రసంగంతో ఎవరినైనా ఇట్టే ఆకట్టుకోగలరు. ఈ విషయం మరోసారి రుజువైంది. శుక్రవారం ఐరాస సర్వప్రతినిధుల సమావేశంలో ప్రధాని మోదీ అదరిపోయే ప్రసంగం ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రపంచం అభివృద్ధిలో భారత్ భాగస్వామ్యం గురించి ఆయన ఎంతో బాగా మాట్లాడారు. సంస్కృతి, ఉగ్రవాదం, వాణిజ్యం, వాతావరణంలో మార్పులు తదితర అంశాల్లో ప్రధాని మోదీ మాట్లాడిన తీరు అక్కడి వారిని ఆకట్టుకుంది. ఆయన సమావేశం పూర్తయి బయటకు వస్తుండగా అక్కడున్న వారందరూ ఒక్కసారి మోదీతో సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు. ఈ సందర్భాన్ని వివరిస్తూ ప్రధాన మంత్రి కార్యాలయం ట్వీట్‌ చేసింది.
‘ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల సందేశాలు వెల్లువెత్తాయి.  ఐరాసలో ఆయన ప్రసంగం తర్వాత సెల్ఫీల కోసం ఇలా పోటీ పడుతున్నారు. మోదీ ప్రసంగం విజయవంతమైందని చెప్పడానికి ఇది నిదర్శనం. ఐరాస కూడా వ్యక్తిగతంగా ప్రధాని మోదీని ప్రశంసించింది’ అని ట్వీట్‌ చేసి ఫొటోను పంచుకుంది.
మోదీ తన ప్రసంగంలో భాగంగా శాంతి, సామరస్యాల గురించి మాట్లాడారు. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయాలని పిలుపునిచ్చారు. సొంత ప్రయోజనాలకు కాకుండా విశ్వ కల్యాణం కోసం భారత్‌ కృషిచేస్తోందని ఉద్ఘాటించారు.

వార్తలు / కథనాలు

మరిన్ని