అమరావతికి ఎన్‌ఆర్‌ఐ వినూత్న మద్దతు
close
అమరావతికి ఎన్‌ఆర్‌ఐ వినూత్న మద్దతు

అమరావతి: అమరావతికి మద్దతుగా రాజధాని గ్రామాలు రైతుల నిరసన దీక్షలతో హోరెత్తుతున్న వేళ వారికి మద్దతుగా ఓ ఎన్‌ఆర్‌ఐ వినూత్న రీతిలో మద్దతు తెలిపారు. విజయవాడ నగరానికి చెందిన యార్లగడ్డ మధుబాబు, స్వప్న దంపతులు అమెరికాలో స్థిరపడ్డారు. నగరంలోని ఓ కల్యాణ మండపంలో తమ కుమారుడి నూతన వస్త్ర బహూకరణ వేడుకను ఘనంగా నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి వచ్చే బంధువులు, అతిథులకు వినూత్నంగా పచ్చ కండువాలు బహూకరించారు. రాజధాని రైతులకు మద్దతు తెలిపేవిధంగా పచ్చ కండువాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన బంధువులు, అతిథులంతా ‘జై అమరావతి’ అని ఉన్న ప్లకార్డులను ప్రదర్శించి అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా మధుబాబు మాట్లాడుతూ... రాష్ట్రంతోపాటు రైతులకు అన్యాయం జరగకూడదనే కారణంతోనే ఈ వేడుకను వినూత్నంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాజధాని రైతులకు రూ.2లక్షలు విరాళం ప్రకటించారు. దీంతోపాటు కుమారుడికి వచ్చే కానుకలను సైతం నగదు రూపంలోకి మార్చి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అమరావతి ఐకాస నాయకులకు ఇవ్వనున్నట్లు తెలిపారు. తనకు అమరావతిలో సెంటు భూమి కూడా లేదని.. 40ఏళ్ల క్రితమే ఈ ప్రాంతం నుంచి వలస వెళ్లామని, కేవలం ఈ ప్రాంతంపై ఉన్న మమకారంతోనే రైతులకు మద్దతు తెలుపుతున్నట్లు మధుబాబు వివరించారు. మరిన్ని