‘స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం భయపడుతోంది’

తాజా వార్తలు

Published : 30/10/2020 17:57 IST

‘స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం భయపడుతోంది’

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శలు

దిల్లీ: ఇతర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయని.. అలాంటప్పుడు ఏపీలో స్థానిక ఎన్నికలకు అభ్యంతరమేంటని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. స్థానిక ఎన్నికలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం భయపడుతోందన్నారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక ఎన్నికల విషయంలో ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఎన్నికల నిర్వహణకు ప్రవీణ్‌ ప్రకాశ్‌ పనికిరారని గతంలో ఎన్నికల కమిషన్‌ తేల్చిందన్నారు. స్థానిక ఎన్నికల సందర్భంగా ప్రవీణ్‌ ప్రకాశ్‌ను పక్కన పెట్టాలని ఆయన కోరారు. 

మంగళవారం సుప్రీంకోర్టులో ఆంగ్లమాధ్యమంపై విచారణ జరగనుందని రఘురామకృష్ణరాజు చెప్పారు. సుప్రీంకోర్టులో స్టే రాకపోతే రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం పాటించాలన్నారు. కరోనాను లెక్కచేయకుండా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ప్రాణాలను బలిపెట్టడం సరికాదని చెప్పారు. పాఠశాలల్లో ఏ భాషలో తరగతులు ప్రారంభిస్తారో ప్రభుత్వం ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. విశాఖ ప్రజల ఇబ్బందులపై సోమవారం చాలా విషయాలు బయటపెడతానని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని