TS news: తెరాస గూటికి ఎల్‌.రమణ!

తాజా వార్తలు

Updated : 08/07/2021 15:18 IST

TS news: తెరాస గూటికి ఎల్‌.రమణ!

హైదరాబాద్‌: తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్‌ రమణ కారెక్కేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఇవాళ మధ్యాహ్నం ఆయన భేటీ కానున్నారు. రమణ తెరాసలో చేరతారనే ఊహాగానాలు ఇటీవల బాగా వినిపించిన  సంగతి తెలిసిందే. అంతేకాకుండా నియోజకవర్గ స్థాయిలోని పలువురు నేతలతో చర్చించి, వాళ్ల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే రమణ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌తో కలిసి రమణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసే అవకాశముంది.త్వరలో ఎమ్మెల్యేల కోటాలో ఆరు, గవర్నర్‌ కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే రమణకు తెరాస ఎమ్మెల్సీ పదవి ఆఫర్‌ చేసినట్లు సమాచారం.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని