తేజస్వి ముఖ్యమంత్రి అవుతారు: ఉమాభారతి

తాజా వార్తలు

Published : 12/11/2020 11:05 IST

తేజస్వి ముఖ్యమంత్రి అవుతారు: ఉమాభారతి

భోపాల్‌: బిహార్‌ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి గట్టి పోటీ ఇచ్చిన ఆర్జేడీ కీలక నేత, మహాగట్‌బంధన్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్‌ను భాజాపా నేత, కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి అభినందించారు. ప్రస్తుతం ఆయనకు రాష్ట్రాన్ని పాలించే అనుభవం లేదని,  ఎప్పటికైనా ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. ఒక వేళ ఇప్పుడు తేజస్వి ముఖ్యమంత్రి అయినా అధికారం మాత్రం ఆయన తండ్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ చేతిలోనే ఉండేదని వ్యాఖ్యానించారు.

‘‘ తేజస్వి యాదవ్‌  చాలా మంచివాడు. అయితే, ఆయనకు రాష్ట్రాన్ని పాలించే అనుభవం లేదు. అందువల్ల తేజస్వి అధికారం చేపట్టినా చక్రం మాత్రం జంగిల్‌ రాజ్‌ (లాలూ) చేతిలోనే ఉండేది. కొంత అనుభవం సాధించాక తేజస్వి రాష్ట్రాన్ని పరిపాలించగలరు’’ అంటూ భూపాల్‌లో మీడియాతో అన్నారు. రాష్ట్రంలోని 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా.. ఎన్డీయే కూటమి 125 స్థానాల్లో గెలుపొందగా.. మహాగట్‌ బంధన్‌ 110, ఎల్‌జేపీ 1, ఇతరులు 7 చోట్ల విజయం సాధించారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 122 స్థానాలను ఎన్డీయే కైవసం చేసుకుంది.

మరోవైపు మధ్యప్రదేశ్‌లో ఉపఎన్నికల్లో పరాజయం పాలైన కమల్‌నాథ్‌ను కూడా ఉమాభారతి అభినందించారు. ఎన్నికల్లో ప్రయత్నలోపం లేకుండా పోరాడారన్నారు. మధ్యప్రదేశ్‌లోని 28 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో 19 స్థానాలను భాజాపా కైవసం చేసుకోగా కాంగ్రెస్‌ 9 స్థానాలకు పరిమితమైంది. రాజకీయ కారణాలతో జోతిరాదిత్య సింధియా వర్గంలోని 22 మంది ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేసి భాజపా జతకట్టడంతో అక్కడ ఉప ఎన్నికలు జరిగాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని