కోల్‌కతా ఓటరుగా మారిన మిథున్‌ చక్రవర్తి
close

తాజా వార్తలు

Published : 22/03/2021 14:12 IST

కోల్‌కతా ఓటరుగా మారిన మిథున్‌ చక్రవర్తి

 
 

కోల్‌కతా: ఇటీవల ప్రధాని మోదీ సమక్షంలో భాజపాలో చేరిన మిథున్ చక్రవర్తి కోల్‌కతా ఓటరుగా మారారు. త్వరలో జరగనున్న పశ్చిమ్‌ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారనే ఊహాగానాల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇంతకాలం ముంబయి ఓటరుగా ఉన్న మిథున్..ప్రస్తుతం కాశీపూర్-బెల్గాచియా ఓటరుగా మారినట్లు ఆయన బంధువు వెల్లడించారు. ‘మా ఇంటి నుంచి ఆయన ఓటరుగా మారారు. ఆయన ఎప్పుడైనా కోల్‌కతా వస్తే మా ఇంట్లోనే బస చేస్తారు’ అని శర్మిష్ఠా సర్కార్ తెలిపారు. ఆమె మిథున్‌కు సమీప బంధువు.

గతంలో మిథున్ చక్రవర్తి తృణమూల్ కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ఆయన మార్చి 7న కోల్‌కతాలో ప్రధాని మోదీ సమక్షంలో భాజపాలో చేరారు. నాటి నుంచి ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. ‘దాదా(మిథున్‌) గొప్ప నటుడు. ఆయన ఏ పాత్రకైనా సరిపోతారు’ అంటూ ఎన్నికల్లో పోటీచేసే విషయంపై మాత్రం శర్మిష్ఠ స్పష్టత ఇవ్వలేదు. తాను పోటీ చేయాలని పార్టీ కోరుకుంటే అందుకు సిద్ధమేనని ఓ ఇంటర్వ్యూలో చక్రవర్తి తన ఉద్దేశాన్ని బయటపెట్టారు. 

ఇదిలా ఉండగా..చివరి నాలుగు దశలకు సంబంధించి పలు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను భాజపా గతవారం ప్రకటించింది. వాటిలో కాశీపూర్-బెల్గాచియా స్థానం కూడా ఉంది. ఆ సీటుకు కేటాయించిన తపన్ సాహా ఎన్నికల్లో పోటీ చేయడానికి నిరాకరించడమే కాకుండా..తానెప్పుడూ భాజపాలో చేరలేదని కమలం పార్టీకి షాక్ ఇచ్చారు. ఇప్పుడు అదే ప్రాంతం నుంచి మిథున్ ఓటరుగా మారడంతో..ఆయన పోటీపై చర్చలు మొదలయ్యాయి. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని