అన్నాడీఎంకే సీనియర్‌నేత మధుసూదన్‌ కన్నుమూత

తాజా వార్తలు

Published : 05/08/2021 17:20 IST

అన్నాడీఎంకే సీనియర్‌నేత మధుసూదన్‌ కన్నుమూత

చెన్నై: అన్నా డీఎంకే ప్రిసీడియం ఛైర్మన్‌, మాజీ మంత్రి మధుసూదన్‌(80) అనారోగ్యంతో  చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 2007 నుంచి అన్నా డీఎంకే ప్రిసీడియం ఛైర్మన్‌గా మధుసూదన్‌ వ్యవహరిస్తున్నారు. 2017లో అన్నా డీఎంకే రెండుగా చీలిపోయినప్పుడు పన్నీర్‌సెల్వంకు మద్దతుగా నిలిచారు. ఈపీఎస్‌, ఓపీఎస్‌ వర్గాలుగా అన్నాడీఎంకే ఉన్న సమయంలో మధుసూదన్‌కు మాత్రమే ఎన్నికల సంఘం పార్టీ పేరు, చిహ్నం అందించింది. అన్నాడీఎంకేలో ముఖ్యమైన నేతగా ఆయన కొనసాగారు. ఎంజీఆర్‌ కాలం నుంచే ఆయన పార్టీకి అత్యంత విశ్వాసపాత్రునిగా ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత తొలి కేబినెట్‌లో 1991 నుంచి 96 వరకు చేనేత, జౌళిశాఖ మంత్రిగా పనిచేశారు. తొండయార్‌పేటలోని ఆయన నివాసానికి మధుసూదన్‌ పార్థివదేహం తరలించారు. రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని