ప్రైవేటీకరణ ఆలోచన కాంగ్రెస్‌దే: సోము వీర్రాజు

తాజా వార్తలు

Updated : 06/04/2021 12:35 IST

ప్రైవేటీకరణ ఆలోచన కాంగ్రెస్‌దే: సోము వీర్రాజు

తిరుపతి: దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలన్న ఆలోచన తొలుత కాంగ్రెస్‌ పార్టీదేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. తిరుపతిలోని భాజపా కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు పార్టీ జెండాను ఎగురవేసి గౌరవవందనం చేశారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ... దేశంలో భారతీయ జనతా పార్టీ పలు సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు.  ‘‘భాజపా వచ్చాకే దేశంలో అవినీతిని అరికట్టాం. అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ.. కుంభకోణాలకు పాల్పడిన అవినీతి పరులను జైళ్లకు పంపించాం. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలన్న ఆలోచన చేసింది మొదట కాంగ్రెస్‌ పార్టీనే. రాష్ట్రంలో కచ్చితంగా అధికారంలోకి వస్తాం’’ అని ఈ సందర్భంగా సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని