హెచ్‌ఎండీఏ అభివృద్ధిపై సీఎంకు కిషన్‌రెడ్డి లేఖ

తాజా వార్తలు

Published : 15/04/2021 12:17 IST

హెచ్‌ఎండీఏ అభివృద్ధిపై సీఎంకు కిషన్‌రెడ్డి లేఖ

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఇవాళ లేఖ రాశారు. హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ(హెచ్‌ఎండీఏ) అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని.. దాని మాస్టర్‌ ప్లాన్‌ను పునఃసమీక్షించాలని అందులో పేర్కొన్నారు. అవసరాలకు తగ్గట్లుగా మాస్టర్‌ ప్లాన్‌లో మార్పులు చేయాలని సూచించారు. హెచ్‌ఎండీఏ, స్థానిక సంస్థల మధ్య సమన్వయం పెరిగేలా చూడాలని లేఖలో స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాల కట్టడికి స్థానిక సంస్థలతో కలిసి పని చేయాలని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. దీంతో పాటు స్థానిక సంస్థలతో కలిసి ఉమ్మడి కార్యాచరణ రూపొందించాలన్నారు. డీపీఎంఎస్‌ సమర్థవంతంగా అమలయ్యేలా చూడాలని వివరించారు. 

రాజేంద్ర నగర్‌, శంషాబాద్‌, నార్సింగి, పటాన్‌చెరు తదితర ప్రాంతాల్లో సర్వీస్‌రోడ్లను పూర్తి చేయాలని కిషన్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఘట్‌కేసర్‌, గౌడవెల్లి, నాగులపల్లి, శంషాబాద్‌ వద్ద వంతెనలు నిర్మించాలన్నారు. భూములను వివిధ జోన్లుగా మార్చే విషయంలో ప్రయోజనాలు దెబ్బతింటాయని రైతులు వాపోతున్నారని.. కేంద్రమంత్రి లేఖలో పేర్కొన్నారు. రైతుల భూములను ఇతర జోన్లకు అంటే నివాస, పారిశ్రామిక, వ్యాపార తదితర జోన్లలోకి మార్చుకోవడానికి చాలా కాలం ఎదురుచూడాల్సి వస్తోందని.. ఈ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కిషన్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని