అది వైకాపాపై వ్యతిరేకతకు నిదర్శనం
close

తాజా వార్తలు

Published : 03/05/2021 01:13 IST

అది వైకాపాపై వ్యతిరేకతకు నిదర్శనం

తెదేపా అధినేత చంద్రబాబు

అమరావతి: తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో వైకాపా నేతల అధికార దుర్వినియోగానికి, అక్రమాలు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన తెదేపా శ్రేణులకు అధినేత చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. వైకాపా అక్రమాలపై ఎదురొడ్డి పోరాడిన తెదేపా కార్యకర్తలను, నాయకులను ఆయన అభినందించారు. తిరుపతి ఉపఎన్నికలో.. ఓటింగ్ శాతం తగ్గడం వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు అద్దం పడుతోందన్నారు. అరాచకాలు, అక్రమాలతో ప్రజాస్వామ్యాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తున్న వైకాపా చర్యలకు వ్యతిరేకంగా పోరాడిన కార్యకర్తల తెగువ స్ఫూర్తిదాయకమని కొనియడారు. ఐదు లక్షలకు పైగా మెజార్టీ వస్తుందని అహంభావంతో వ్యవహరించిన వైకాపా శ్రేణులకు ఓటుతో బుద్ధి చెప్పిన తిరుపతి లోక్ సభ ఓటర్లను చంద్రబాబు అభినందించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని