close

తాజా వార్తలు

Updated : 07/03/2021 15:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అమరావతి కోసం ఇంటికొకరు రావాలి: బాబు

విజయవాడ: వైకాపా 20 నెలల పాలనలో సీఎం జగన్‌ వీధికో రౌడీని తయారు చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.అమరావతి ఆంధ్రుల హక్కు.. దీనిపై అందరూ పోరాడాలని పిలుపునిచ్చారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ 41వ డివిజన్‌లో ఆయన పర్యటించారు. మంత్రుల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీలో కొంతమంది నాయకులకు స్వేచ్ఛ ఎక్కువైందని, వారిని నియంత్రిస్తానని కార్యకర్తలకు హామీ ఇచ్చారు.

అమరావతి కోసం విజయవాడ ప్రజలు ఇంటికొకరు రావాలని అన్నారు. అమరావతి కోసం పక్కా ప్రణాళికతో ముందుకెళ్లామని, విజయవాడ ప్రజలు గట్టిగా నిలబడాలని చెప్పారు. పట్టిసీమ నీటి లబ్ధిదారులు ఆలోచించాలన్నారు. విజయవాడ మేయర్‌గా కచ్చితంగా తెదేపా అభ్యర్థే ఉండాలని, లేదంటే ఇక్కడి ప్రజలు తలెత్తుకు తిరగలేరని అన్నారు. ‘‘ ఇక్కడి మంత్రికి దుర్గమ్మపైనా భయం, భక్తి లేదు. విజయవాడలో తెదేపా గెలవకుండా మీరు తలెత్తుకు తిరగలేరు. రాష్ట్రాన్ని నేరస్తులు, గూండాల అడ్డాగా మార్చారు’’ అని విమర్శించారు. పేదవాడి కడుపు నింపే అన్న క్యాంటీన్లను తీసేశారని దుయ్యబట్టారు.

‘‘ఉద్యమాలు, రాజకీయ చైతన్యానికి విజయవాడ స్ఫూర్తి. నేను ఓట్లు అడుక్కోవడానికి రాలేదు. ప్రజల బాధ్యత గుర్తు చేసేందుకే వచ్చాను. పంచాయతీరాజ్ శాఖ మంత్రి రౌడీ అయితే నేను ఆ రౌడీలకే రౌడీ లాంటివాడిని. సీఎం జగన్‌, మంత్రులకు ప్రజలు భయపడాల్సిన పనిలేదు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉగ్రవాదం నడుస్తోంది. తన జేట్యాక్స్ కోసం ఉపాధ్యాయులను కూడా మద్యం దుకాణాల వద్ద కాపలా పెట్టారు. 22 నెలల్లో విజయవాడలో అభివృద్ధి శూన్యం. జగన్‌ ప్రజలకు ఇచ్చింది తక్కువ, దోచింది ఎక్కువ.  డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తే మీ జీవితం ఇక చీకటి మయమే అవుతుంది’’ అని చంద్రబాబు అన్నారు.




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని