హుజూరాబాద్‌లో ఈటలకు ఘన స్వాగతం
close

తాజా వార్తలు

Updated : 17/06/2021 19:13 IST

హుజూరాబాద్‌లో ఈటలకు ఘన స్వాగతం

హుజూరాబాద్‌: భాజపాలో చేరిన తర్వాత తొలిసారి హుజూరాబాద్‌ వచ్చిన ఈటల రాజేందర్‌కు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. శామీర్‌పేటలోని తన నివాసం నుంచి హుజూరాబాద్‌ బయలుదేరిన ఈటలకు అడుగడుగునా నీరాజనం పలికారు. ప్రజ్ఞాపూర్‌ వద్ద భాజపా శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. గజ్వేల్‌ నియోజకవర్గంతో తనకు ఎంతో అనుబంధం ఉందని, ఇక్కడే తాను ఉద్యమంలో చేరానని ఈటల తెలిపారు.

అక్కడి నుంచి బయలుదేరిన ఈటలకు హుస్నాబాద్‌లోనూ ఘన స్వాగతం పలికారు. మల్లెచెట్టు చౌరస్తా నుంచి అంబేడ్కర్‌ చౌరస్తా వరకు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. ఈటల, వివేక్‌, రఘునందన్‌రావును శాలువాలతో సన్మానించారు. అనంతరం అంబేడ్కర్‌ చౌరస్తాలో అంబేడ్కర్‌ విగ్రహానికి ఈటల రాజేందర్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. నియోజకవర్గానికి చేరుకున్న ఈటల... నాలుగు రోజుల పాటు హుజూరాబాద్‌లో ఉండనున్నారు. నాగారం, నగురంలో పర్యటించనున్నారు. హుజూరాబాద్‌ ఎన్నిక తర్వాత భాజపా బలోపేతానికి రాష్ట్రమంతా పర్యటిస్తానని ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ వెల్లడించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని