రైతుల కోసం ఎంతవరకైనా పోరాటం: పవన్

తాజా వార్తలు

Updated : 29/12/2020 13:10 IST

రైతుల కోసం ఎంతవరకైనా పోరాటం: పవన్

మచిలీపట్నం : రాష్ట్రంలో రైతులకు న్యాయం జరిగేందుకు ఎంత వరకైనా పోరాటం చేస్తామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. కృష్ణా జిల్లాలో నివర్‌ తుపాను ప్రభావిత ప్రాంతంలో పర్యటించిన పవన్‌.. రైతులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. కంకిపాడు మీదుగా గుడివాడ చేరుకున్న పవన్‌ అక్కడ నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. గుడివాడకు వచ్చే రహదారులు అధ్వానంగా ఉన్నాయని.. కొత్త రోడ్లు నిర్మించాలంటూ స్థానిక నేతలను నిలదీయాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. 

వైకాపా నేతలకు పేకాట క్లబ్బులు నిర్వహించడంపై ఉన్న శ్రద్ధ పాలనపై లేదని విమర్శించారు. ప్రజా ప్రతినిధులెవరైనా బాధ్యతగా వ్యవహరించకపోతే వారిని రోడ్డు మీదకు తీసుకొచ్చే సత్తా ప్రజలకు ఉందన్నారు. ప్రజలను భయపెట్టి పాలిస్తామంటే సహించడానికి ఎవరూ సిద్ధంగా లేరని చెప్పారు. మార్పు రావాలి.. అందరికీ న్యాయం జరగాలని పవన్‌ ఆకాంక్షించారు. దాష్టీకం చేసే ఏ ప్రజాప్రతినిధినైనా జనసేన చాలా బలంగా ఎదుర్కొంటుందని ఆయన చెప్పారు.

ఇవీ చదవండి..
చెప్పిన దానికంటే ఎక్కువగానే..: సీఎం జగన్‌

కొవిడ్‌ టీకా డ్రైరన్‌ విజయవంతం
 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని