నిర్లక్ష్యమని తేలితే అత్యంత కఠిన చర్యలు

తాజా వార్తలు

Published : 09/08/2020 14:15 IST

నిర్లక్ష్యమని తేలితే అత్యంత కఠిన చర్యలు

అగ్ని ప్రమాద ఘటనపై కమిటీ : ఆళ్లనాని

విజయవాడ : విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో చోటుచేసుకున్న ఘోర అగ్ని ప్రమాద ఘటనలో 10 మంది మృతి చెందారని మంత్రి ఆళ్లనాని వెల్లడించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారని చెప్పారు. తెల్లవారుజామున 4.45 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుందని వివరించారు. అగ్నిమాపక సిబ్బంది సత్వర స్పందనతో చాలా మంది ప్రాణాలు నిలిచాయన్నారు.ఘటనపై కలెక్టర్‌, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. 

‘కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో 31 మంది రోగుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన 21 మంది క్షేమంగా ఉన్నారు. ఆరుగురు సిబ్బంది కూడా క్షేమంగా ఉన్నారు. ఈ ప్రమాదంపై కమిటీ వేశాం. ఆస్పత్రికి సంబంధించి అన్ని అనుమతులు ఉన్నాయా లేదో ఈ కమిటీ పరిశీలిస్తుంది. ప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్‌ లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అని కమిటీ విచారణ చేస్తుంది. ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. 48 గంటల్లో పూర్తిస్థాయి నివేదికలు ఇవ్వాలని ఆదేశించాం. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే అత్యంత కఠిన చర్యలు ఉంటాయి. నివేదికలు రాగానే చర్యలు తీసుకుంటాం’ అని మంత్రి ఆళ్లనాని తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని