TS News: వైద్యం కోసం ఆస్తుల‌మ్ముకునే దుస్థితి: ఉత్తమ్

తాజా వార్తలు

Updated : 07/06/2021 13:41 IST

TS News: వైద్యం కోసం ఆస్తుల‌మ్ముకునే దుస్థితి: ఉత్తమ్

కొవిడ్ క‌ట్ట‌డిలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు విఫ‌లం

స‌త్యాగ్ర‌హ దీక్ష‌లో టీపీసీసీ అధ్యక్షుడు

హైద‌రాబాద్‌: క‌రోనా క‌ట్ట‌డిలో కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు విఫ‌ల‌మ‌య్యాయ‌ని టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి విమ‌ర్శించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కొవిడ్‌ టీకాను ఉచితంగా వేయాల‌నే ప్రధాన డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీ స‌త్యాగ్ర‌హ‌ దీక్షలు చేపట్టింది. ఈ కార్య‌క్ర‌మాన్ని గాంధీభ‌వ‌న్‌ల్‌లో ఉత్త‌మ్‌ ప్రారంభించారు.  ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. వైద్యం కోసం ప్రజలు ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి నెల‌కొంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. క‌రోనా, బ్లాక్ ఫంగ‌స్ బారిన ప‌డిన బాధితుల‌కు ఉచిత చికిత్స అందించాల‌ని.. ఈ చికిత్స‌ల‌ను ఆరోగ్య‌శ్రీ‌లో చేర్చాల‌ని ఉత్త‌మ్‌ డిమాండ్ చేశారు. 

అన్ని జిల్లా కేంద్రాల్లోనూ చేప‌ట్టిన ఈ దీక్ష‌లు ఈ మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌ వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి. ఏఐసీసీ ఇచ్చిన పిలుపులో భాగంగా చేపడుతున్న ఈ కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పాల్గొని విజయవంతం చేయాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. గాంధీ భ‌వ‌న్‌లోని స‌త్యాగ్ర‌హ దీక్ష‌లో సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క‌, ఎమ్మెల్సీ జీవ‌న్‌రెడ్డి, సీనియ‌ర్ నేత‌ పొన్నాల ల‌క్ష్మ‌య్య‌, ఎంపీ కోమ‌టిరెడ్డి, వంశీచంద్‌రెడ్డి, మర్రి శ‌శిధ‌ర్‌రెడ్డి త‌దితరులు పాల్గొన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని