నామినేటెడ్‌ పదవుల్లో వివక్ష: అచ్చెన్నాయుడు

తాజా వార్తలు

Published : 21/07/2021 11:51 IST

నామినేటెడ్‌ పదవుల్లో వివక్ష: అచ్చెన్నాయుడు

అమరావతి: నిధులు, అధికారాలున్న కార్పొరేషన్లను సీఎం జగన్‌ సొంత సామాజిక వర్గానికి ఇచ్చి ప్రాధాన్యత లేని పదవులను బలహీనవర్గాలకు ఇచ్చారని తెదేపా ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. వైకాపాలోని రాజకీయ నిరుద్యోగులకు పదవులు కట్టబెట్టడంపై ఉన్న శ్రద్ధ.. విద్యావంతులైన నిరుద్యోగులపై లేదని మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మంత్రులను డమ్మీలుగా చేశారని.. నామినేటెడ్‌ పదవుల్లోనూ వివక్ష చూపించారని అచ్చెన్నాయుడు ఆక్షేపించారు. ఆ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 

‘‘బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ అవకాశాలను దెబ్బతీశారు. సబ్ ప్లాన్ నిధుల్లో కోత పెట్టారు. ఇళ్ల పట్టాల పేరుతో 10వేల ఎకరాల బడుగుల అసైన్డ్‌ అభూముల్ని లాక్కున్నారు.  దాడులు, అత్యాచారాలు, హత్యలతో తెగబడుతూ బడుగులకు రాష్ట్రంలో బతికే పరిస్థితి లేకుండా చేశారు. బలహీన వర్గాల అణచివేతే లక్ష్యంగా అధికారం చెలాయిస్తున్నారు. తెదేపా  హయాంలో కీలక పదవులను బడుగు బలహీన వర్గాలకు కేటాయిస్తే.. నేడు జగన్‌ ఉన్నత పదవులన్నింటినీ సొంత సామాజిక వర్గానికి కట్టబెట్టారు. సామాజిక న్యాయం పేరుతో సామాజిక ద్రోహం చేస్తున్నారు’’ అని అచ్చెన్నాయుడు విమర్శించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని