Ap News: అచ్చెన్న డిమాండ్ సరైంది కాదు: బొత్స సత్యనారాయణ

తాజా వార్తలు

Published : 20/09/2021 15:20 IST

Ap News: అచ్చెన్న డిమాండ్ సరైంది కాదు: బొత్స సత్యనారాయణ

అమరావతి: ప్రభుత్వాన్ని రద్దు చేయాలన్న తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి డిమాండ్‌ సరైంది కాదని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అచ్చెన్న పదవికి రాజీనామా చేస్తే తానూ చేస్తానని బొత్స తెలిపారు. ఇద్దరం రాజీనామా చేసి పోటీ చేసి ప్రజా బలం తేల్చుకుందామని అచ్చెన్నకు సవాల్ విసిరారు. గతంలో ఇచ్చిన ఇళ్లకు సీఎం జగన్ శాశ్వత హక్కు కల్పిస్తామన్నారని చెప్పారు. దాదాపు 60 లక్షల మందికి శాశ్వత హక్కు కల్పించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. డిసెంబర్‌లోగా 80 వేల టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించనున్నట్లు వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని