AP News: పోలీసులపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర ఆగ్రహం

తాజా వార్తలు

Updated : 21/10/2021 12:50 IST

AP News: పోలీసులపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర ఆగ్రహం

ఏలూరు: తెదేపా సీనియర్‌ నేత, రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని పోలీసులు అడ్డుకున్నారు. తన వాహనంలో రాజమహేంద్రవరం నుంచి అమరావతి వెళ్తుండగా ఏలూరు సమీపంలో ఆపేయడంతో పోలీసులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతల సమస్య ఉందని పోలీసులు చెప్పినా బుచ్చయ్య చౌదరి వినిపించుకోలేదు. అమరావతి సచివాలయంలో పనుల నిమిత్తం వెళ్తున్న తనను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధిగా అక్కడికి వెళ్లే హక్కు తనకు ఉందని.. అడ్డుకునేందుకు మీరెవరని పోలీసులను ఆయన నిలదీశారు. దమ్ముంటే తనను అరెస్ట్‌ చేసుకోవాలని.. ఇక్కడే కూర్చొంటానన్నారు. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని