Errabelli Dayakar: దేవాదుల జలాలు సద్వినియోగం చేసుకోవాలనేదే సీఎం ఆలోచన: ఎర్రబెల్లి

తాజా వార్తలు

Updated : 29/08/2021 17:23 IST

Errabelli Dayakar: దేవాదుల జలాలు సద్వినియోగం చేసుకోవాలనేదే సీఎం ఆలోచన: ఎర్రబెల్లి

హనుమకొండ: దేవాదుల రిజర్వాయర్‌ పెండింగ్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్‌లో దేవాదుల ప్రాజెక్టుపై మంత్రి సత్యవతి రాథోడ్‌, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌తో కలిసి ఎర్రబెల్లి సమీక్షించారు. దేవాదుల ప్రాజెక్టు పెండింగ్‌ పనుల పురోగతిపై ప్రధానంగా చర్చించారు. 60 టీఎంసీల దేవాదుల నీటిని వరంగల్‌ జిల్లాకే పూర్తిగా వాడుకోవాలని సీఎం కేసీఆర్‌ చెప్పారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. కాళేశ్వరం, దేవాదులతో ఉమ్మడి వరంగల్‌ జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు.

‘‘దేవాదుల ప్రాజెక్టు పనులు 80 శాతం పూర్తి చేశాం. భూసేకరణ కూడా పూర్తి చేశాం. పైప్‌లైన్‌, రిజర్వాయర్‌ పనులన్నీ పూర్తయ్యాయి. ప్యాకేజీ-2లోని రిజర్వాయర్‌ పనులు పూర్తి చేశాం. లింగంపల్లి ఎడమ కాలువ పనులను పూర్తి చేయాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో ప్రతి ఎకరానికి నీరు అందాలని, ప్రతి చెరువు నింపాలని సీఎం కేసీఆర్‌ పట్టుదలతో ఉన్నారు. ఎప్పటికప్పుడు సమీక్ష చేసి సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సీఎం సూచించారు. అందుకు అనుగుణంగా ఇప్పటికే దేవాదులకు సంబంధించి అనేక అంశాలు సీఎం దృష్టికి తీసుకెళ్లాం. సమస్యలన్నింటినీ పరిష్కరించాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు. దేవాదులను సద్వినియోగం చేసుకోవాలనేదే సీఎం కేసీఆర్‌ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు అధికారులతో సమన్వయం చేసుకుంటూ కలెక్టర్లు పనిచేస్తున్నారు’’ అని ఎర్రబెల్లి తెలిపారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని