RS praveen kumar: పాలకులు దోచుకున్న సొమ్మును గల్లా పట్టి తీసుకొస్తాం: ప్రవీణ్‌కుమార్‌

తాజా వార్తలు

Updated : 24/08/2021 18:17 IST

RS praveen kumar: పాలకులు దోచుకున్న సొమ్మును గల్లా పట్టి తీసుకొస్తాం: ప్రవీణ్‌కుమార్‌

వరంగల్‌: పాలకులు దుర్మార్గంగా దోచుకున్న వేల కోట్ల రూపాయలను గల్లా పట్టి వాపస్‌ తీసుకొచ్చి.. ఆ డబ్బును విద్య, వైద్యం, ఉపాధి కల్పన కోసం వెచ్చిస్తామని బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ స్పష్టం చేశారు. హనుమకొండలో ఏర్పాటు చేసిన బీఎస్పీ ఉమ్మడి వరంగల్‌ జిల్లా సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ఈ దేశానికి పాలకులమవుతామని జోస్యం చెప్పారు. ‘‘మేం అంబేడ్కర్‌, కాన్షీరాం వారసులం. మా రక్తంలో మాట తప్పే, మడమ తిప్పే లక్షణం లేదు. రాజ్యాంగం రాసిందే మా తాత అంబేడ్కర్‌. భవిష్యత్‌లో బీసీ, ఎస్టీ, ఎస్సీ బిడ్డలే పాలకులవుతారు. బానిసలవుతారా? పాలకులవుతారా? మీరే తేల్చుకోవాలి. గులాబీ తెలంగాణ కాదు.. నీలి తెలంగాణ రావాలి. ఏనుగు గుర్తును గెలిపించాలని బహుజన దేవతలకు మొక్కాలి’’ అని ప్రవీణ్ కుమార్‌ పిలుపునిచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని