త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర: రేవంత్‌

తాజా వార్తలు

Published : 17/02/2021 00:59 IST

త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర: రేవంత్‌

​​​​​​

హైదరాబాద్‌: త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఏఐసీసీ ఆదేశాలతో రోడ్‌మ్యాప్‌ వేసుకొని పాదయాత్ర చేస్తానని వెల్లడించారు. కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా పాదయాత్ర చేస్తానని పేర్కొన్నారు. కేసీఆర్‌ మోదీ జట్టు వీడి బయటకు రావాలని సూచించారు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన సాగుచట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాలని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. 
అచ్చంపేటలో ఈ నెల 7న రేవంత్‌రెడ్డి మొదలుపెట్టిన రైతుభరోసా పాదయాత్ర మంగళవారంతో ముగిసింది. రంగారెడ్డి జిల్లా రావిరాలలో పాదయాత్రకు రేవంత్‌రెడ్డి ముగింపు పలికారు. నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట నుంచి రావిరాల వరకు మొత్తం 149 కి.మీ మేర రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని