కేసీఆర్‌ అణచివేత ధోరణి అంతమే ఏకైక ఎజెండా
close

ప్రధానాంశాలు

కేసీఆర్‌ అణచివేత ధోరణి అంతమే ఏకైక ఎజెండా

ఉప ఎన్నికపై మాజీ మంత్రి ఈటల

హుజూరాబాద్‌, న్యూస్‌టుడే: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కేసీఆర్‌ అహంకారానికి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్నదని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ అన్నారు. కేసీఆర్‌ అణచివేత ధోరణికి అంతం పలకడమే ఏకైక ఎజెండాగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. హుజూరాబాద్‌లో గురువారం భాజపా జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన పార్టీ పట్టణ, మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో ఈటల మాట్లాడారు. పింఛన్లు, రేషన్‌కార్డులు ఇస్తామని, గ్రామానికి రూ.50 లక్షలు, రూ.కోటి ఇస్తామని మంత్రులు, ఎమ్మెల్యేలు మాయమాటలు చెబుతున్నారని ఆరోపించారు. ఉప ఎన్నిక బాధ్యులు, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ, ఈటల లేకపోతే అసలు తెలంగాణ ఉద్యమమే లేదన్నారు. ఎమ్మెల్యే రఘునందన్‌రావు మాట్లాడుతూ, ప్రజాస్వామ్య పాలన కావాలో, గడీల పాలన కావాలో ప్రజలే తేల్చుకోవాలని సూచించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని