దోపిడీ పార్టీలకు బుద్ధి చెప్పాలి

ప్రధానాంశాలు

దోపిడీ పార్టీలకు బుద్ధి చెప్పాలి

భట్టి విక్రమార్క

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌: దోపిడీ పార్టీలుగా పేరొందిన భాజపా, తెరాసలకు హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. మంగళవారం హుజూరాబాద్‌ మండలంలోని పలుగ్రామాల్లో నిర్వహించిన కాంగ్రెస్‌ ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెరాస నుంచి బయటకు వచ్చిన ఈటల.. తానేకాదు తెరాసలో తనకన్నా ఎక్కువ సంపాదించినోళ్లు ఉన్నారనేలా మాట్లాడుతున్నారన్నారు. దీన్నిబట్టి ప్రజలు ఆలోచించుకోవాలని ఆయన కోరారు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు పడే ప్రతి ఓటు భవిష్యత్తులో రాష్ట్రాన్ని కాపాడే ఆయుధమవుతుందని ఆయన అన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని