విమానాశ్రయంలో భారత క్రికెటర్‌ అడ్డగింత!

తాజా వార్తలు

Published : 13/11/2020 01:01 IST

విమానాశ్రయంలో భారత క్రికెటర్‌ అడ్డగింత!

ముంబయి: భారత క్రికెట్‌ జట్టు ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యకు ముంబయి విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. ఐపీఎల్‌ ముగించుకుని యూఏఈ నుంచి భారత్‌కు చేరుకున్న క్రమంలో డైరక్టర్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటలిజెన్స్‌ అధికారులు అతడిని అడ్డుకున్నారు. అతడి వద్ద ఉన్న బంగారం, ఇతర విలువైన వస్తువులకు అనుమతులు లేవనే ఆరోపణలతో విమానాశ్రయంలోనే నిలిపివేశారు. ఈ మేరకు డీఆర్‌ఐ వర్గాలు వెల్లడించారు. ఐపీఎల్‌ 2020లో భాగంగా కృనాల్‌పాండ్య ముంబయి ఇండియన్స్‌ జట్టు తరపున ఆడిన విషయం తెలిసిందే. కాగా ఈ టోర్నీ ఫైనల్‌లో ముంబయి జట్టు విజేతగా నిలిచి ఐదోసారి టైటిల్‌ను గెలుచుకుంది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని