close
Array ( ) 1

తాజా వార్తలు

భారత దేశానికి ఇది గర్వకారణం: విరాట్‌

సచిన్‌కు ప్రతిష్టాత్మక అవార్డుపై టీమ్‌ఇండియా కెప్టెన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: బెర్లిన్‌ వేదికగా ప్రతిష్టాత్మక లారస్‌ స్పోర్టింగ్‌ 2000-2020 అవార్డు గెలుపొందిన క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ తెందూల్కర్‌కు టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ శుభాకాంక్షలు చెప్పాడు. సచిన్‌ ఈ అవార్డును సాధించడం గొప్ప విషయమని, ఇది దేశానికి గర్వకారణమని కోహ్లీ ట్వీట్‌ చేశాడు. 2011 వన్డే ప్రపంచకప్‌ సందర్భంగా ధోనీ.. సిక్స్‌ కొట్టి భారత్‌ను రెండోసారి విశ్వవిజేతగా నిలిపిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారత ఆటగాళ్లు మాస్టర్‌ బ్లాస్టర్‌ను తమ భుజాలపై ఎత్తుకొని గౌరవ సూచకంగా మైదానంలో కలియ తిరిగారు. ఈ నేపథ్యంలోనే సచిన్‌ లారస్‌ స్పోర్టింగ్‌ మొమెంట్‌ అవార్డుల ప్రదానోత్సవంలో అత్యధిక ఓట్లు సాధించి విజేతగా నిలిచారు. కోహ్లీతో పాటు ఐసీసీ సైతం సచిన్‌కు శుభాకాంక్షలు చెప్పింది.

ఈ అవార్డుల ప్రదానోత్సవంలో సచిన్‌ క్రీడల ప్రాముఖ్యాన్ని తెలియజేశారని, అతని మాటలు గుండెలను హత్తుకున్నాయని ఐసీసీ ట్వీట్‌ చేసింది. ‘క్రీడలు మన జీవితాల్లో ఎంత శక్తిమంతమైనవో, అవి ఏ మాయాజాలం చేస్తాయో ఈ అవార్డు నిరూపించిందని సచిన్‌ పేర్కొన్న వ్యాఖ్యలను ఐసీసీ జత చేసింది. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.