Cricket News: లైయన్‌ కాదు అశ్విన్‌!

తాజా వార్తలు

Updated : 07/06/2021 13:49 IST

Cricket News: లైయన్‌ కాదు అశ్విన్‌!

లైయన్‌ పరుగులు ఇస్తున్నాడన్న ఛాపెల్‌

ముంబయి: నేథన్‌ లైయన్‌తో పోలిస్తే రవిచంద్రన్‌ అశ్విన్‌ మెరుగైన స్పిన్నర్‌ అని ఆసీస్‌ మాజీ సారథి ఇయాన్‌ ఛాపెల్‌ అన్నాడు. కుడిచేతి వాటం బ్యాటర్లకు బౌలింగ్‌ చేసినప్పుడు లైయన్‌ ఆన్‌సైడ్‌ ఎక్కువ పరుగులు ఇస్తాడని పేర్కొన్నాడు. ఈ విషయంలో యాష్‌ అతడిపై పైచేయి సాధించాడని వెల్లడించాడు. కాగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ దేశాల్లో వికెట్లు తీసేందుకు యాష్‌ వెనుకంజలో ఉంటాడని సంజయ్‌ మంజ్రేకర్‌ చెప్పిన సంగతి తెలిసిందే.

‘నేథన్‌ లైయన్‌తో పోలిస్తే అశ్వినే మెరుగని నా అభిప్రాయం. 2018 నుంచి లైయన్‌ స్ట్రైక్‌రేట్‌ గమనించండి. అతడు కుడిచేతివాటం బ్యాటర్లకు బౌలింగ్‌ చేస్తుంటే ఆన్‌సైడ్‌ ఎక్కువ పరుగులు ఇస్తాడు. నిజానికి అలా జరగొద్దు. నిజమే, లైయన్‌ మంచి బౌలరే. కానీ అశ్విన్‌ అంతకన్నా మెరుగైన బౌలర్‌’ అని ఛాపెల్‌ తెలిపాడు.

‘నేను మరికొన్ని విషయాలు చెబుతా. మీరొకసారి జోయెల్‌ గార్నర్‌ను చూడండి. ఎన్నిసార్లు ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడో పరిశీలించండి. ఎక్కువగా ఉండవు. కానీ అతడెందుకు మెరుగైన బౌలర్‌గా ఉన్నాడు? ఎందుకంటే అతడితోపాటు ఆడిన మిగతా ముగ్గురు, నలుగురు బౌలర్లు అత్యుత్తమం. ఈ తరంలో టీమ్‌ఇండియా బౌలింగ్‌ దాడి అంత పటిష్ఠంగా ఉందని నా అభిప్రాయం. ఎక్కువ మంది వికెట్లను పంచుకుంటున్నారు’ అని ఛాపెల్‌ పేర్కొన్నాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని