Ambrose మెచ్చిన బుమ్రా.. ఏమన్నాడంటే?
close

తాజా వార్తలు

Published : 10/05/2021 01:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ambrose మెచ్చిన బుమ్రా.. ఏమన్నాడంటే?

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా పేస్‌ గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా కచ్చితంగా 400 వికెట్లు పడగొడతాడనే నమ్మకం ఉందని వెస్టిండీస్‌ మాజీ పేసర్‌ కర్ట్‌లీ ఆంబ్రోస్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇటీవల ఓ యూట్యూబ్‌ కార్యక్రమంలో పాల్గొన్న అతడు టీమ్‌ఇండియా బౌలింగ్‌పై స్పందించాడు. భారత జట్టుకు ఇప్పుడు అత్యుత్తమ బౌలింగ్‌ దళం ఉందని, అయితే, తాను బుమ్రాకు వీరాభిమాని అని ఆంబ్రోస్‌ పేర్కొన్నాడు. అందరికన్నా అతడెంతో భిన్నమైన ఆటగాడని మెచ్చుకున్నాడు. బుమ్రా టీమ్‌ఇండియాకు ఎంపికైనప్పటి నుంచి అద్భుత ప్రదర్శనతో మెప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌తో పాటు ఇంగ్లాండ్‌ పర్యటనకూ ఎంపికయ్యాడు.

‘భవిష్యత్‌లోనూ బుమ్రా ఇలాగే వికెట్లు తీస్తూ ముందుకు సాగాలని ఎదురుచూస్తున్నా. అతడు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నంతకాలం వికెట్లు తీస్తూనే ఉంటాడు. బంతిని స్వింగ్ చేస్తూ, యార్కర్లు సంధిస్తూ ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తాడు. అతడి అమ్ములపొదిలో మరిన్ని అస్త్రాలున్నాయి. దీర్ఘకాలం పాటు క్రికెట్‌లో కొనసాగితే కచ్చితంగా 400 వికెట్లు తీస్తాడు’ అని మాజీ పేసర్‌ వివరించాడు. కాగా, బుమ్రా ఇప్పటివరకు 19 టెస్టులు ఆడి 83 వికెట్లు తీశాడు. ఇటీవల స్వదేశంలో జరిగిన ఇంగ్లాండ్‌ టెస్టు సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడి 4 వికెట్లు తీశాడు. ఇక వివాహం నేపథ్యంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరమైన అతడు తర్వాత ఐపీఎల్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడి ఆరు వికెట్లు సాధించాడు. ఇప్పుడు వచ్చేనెలలో జరగబోయే టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు సన్నద్ధమవుతున్నాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని