వేదా కృష్ణమూర్తి పట్ల BCCI తీరుపై ఆగ్రహం
close

తాజా వార్తలు

Published : 15/05/2021 23:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వేదా కృష్ణమూర్తి పట్ల BCCI తీరుపై ఆగ్రహం

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటీవల టీమ్‌ఇండియా మహిళా క్రికెటర్‌ వేదా కృష్ణమూర్తి ఇంట్లో రెండు విషాదాలు చోటుచేసుకున్నాయి. కొవిడ్‌-19 కారణంగా రెండు వారాల వ్యవధిలో ఆమె తన తల్లిని, సోదరిని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ విషయంలో బీసీసీఐ వ్యవహరించిన తీరు బాగోలేదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ లీసా స్తాలేకర్‌ అసహనం వ్యక్తం చేసింది. ఆమె ఒక ట్వీట్‌ చేస్తూ బీసీసీఐ పద్ధతిని తప్పుబట్టింది.

‘వచ్చేనెల ఇంగ్లాండ్‌ పర్యటనకు వేదాను ఎంపికచేయకపోవడం బీసీసీఐ దృష్టిలో సరైన నిర్ణయమే కావచ్చు. అయితే, నాకిక్కడ కోపం తెప్పించిన విషయం ఏమిటంటే.. ఆమె ఇంట్లో రెండు విషాదాలు చోటుచేసుకున్నా బీసీసీఐ కనీసం పలకరించకపోవడం. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఎలా ఉన్నారని కూడా వాకబు చేయకపోవడం. నిజమైన యాజమాన్యం క్రికెటర్లను జాగ్రత్తగా చూసుకోవాలి. అది కేవలం ఆటకు సంబంధించిన వరకే పరిమితం కావద్దు. ఈ విషయంలో చాలా నిరాశ చెందాను’ అని లీసా పేర్కొంది.

అలాగే ఆమె ఒక మాజీ క్రికెటర్‌గా ఉండగా, ఆస్ట్రేలియా క్రికెటర్స్‌ అసోసియేషన్‌ ఎప్పటికప్పుడు తమ బాగోగులు అడిగి తెలుసుకుందని, వారికి అవసరమైన సహాయం చేసిందని లీసా వివరించింది. భారత్‌లోని క్రికెటర్లకు ఇప్పుడేమైనా సహాయం కావాలంటే అందుకు ఇదే సరైన సమయం. ఈ మహమ్మారి కారణంగా చాలా మంది ఆటగాళ్లు ఒత్తిడి, ఆందోళన, భయాలకు గురయ్యారు. అది వారిపై వ్యక్తిగతంగా ప్రభావం చూపుతుంది. దాంతో అనూహ్యంగా ఆటపై ప్రభావం చూపుతుంది’ అని ఆస్ట్రేలియా మాజీ సారథి చెప్పుకొచ్చింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని