లోకల్‌ బాయ్స్‌ ఆల్‌రౌండ్‌ షో

తాజా వార్తలు

Updated : 08/02/2021 17:34 IST

లోకల్‌ బాయ్స్‌ ఆల్‌రౌండ్‌ షో

ఇంటర్నెట్‌డెస్క్‌: చెన్నై టెస్టు నాలుగో రోజు ఆటలో లోకల్‌ బాయ్స్‌ అదరగొట్టారు. వాషింగ్టన్‌ సుందర్‌ (85*; 138 బంతుల్లో, 12×4, 2×6) గొప్ప పోరాటానికి రవిచంద్రన్ అశ్విన్‌ (6/61) మాయాజాలం తోడవ్వడంతో టీమిండియా తిరిగి పోటీలోకి వచ్చింది. కానీ (12; 20 బంతుల్లో, 1×4, 1×6) రోహిత్ నిరాశపర్చడంతో సోమవారం ఆట ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ వికెట్ నష్టానికి 39 పరుగులు చేసింది. టీమిండియా విజయం సాధించాలంటే ఆఖరి రోజు 381 పరుగులు చేయాలి. క్రీజులో శుభ్‌మన్‌ గిల్ (15; 35 బంతుల్లో, 3×4), పుజారా (12; 23 బంతుల్లో, 1×4) ఉన్నారు.

అయితే 257/6 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆటను ఆరంభించిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 337 పరుగులకే ఆలౌటైంది. సుందర్ ఒంటరి పోరాటం చేశాడు. అనంతరం 241 పరుగుల ఆధిక్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ అశ్విన్‌ ధాటికి 178 పరుగులకే కుప్పకూలింది. నదీమ్‌ రెండు వికెట్లతో సత్తాచాటాడు. ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్‌లో జో రూట్ (40) టాప్‌ స్కోరర్‌.

సుందర్ పోరాటం..

సుందర్, అశ్విన్‌ (31; 91 బంతుల్లో, 3×4, 1×6) సోమవారం ఆటను గొప్పగా ఆరంభించారు. ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు సాధించారు. ఈ క్రమంలో సుందర్ 82 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. అయితే కొత్త బంతిని అందుకున్న అనంతరం ప్రత్యర్థి బౌలర్లు చెలరేగారు. అశ్విన్, నదీమ్‌ (0)ను స్వల్ప వ్యవధిలోనే లీచ్ బోల్తాకొట్టించాడు. దీంతో సుందర్ ఎదురుదాడికి దిగాలని భావించాడు. ఎడాపెడా బౌండరీలు సాధించాడు. కానీ ఇషాంత్‌ శర్మ (4), బుమ్రా (0)ను అండర్సన్‌ ఔట్ చేసి టీమిండియాను దెబ్బతీశాడు. టెయిలెండర్ల సహకారం ఉంటే సుందర్ శతకం సాధించేలా కనిపించాడు.


అశ్విన్ అదరహో

భారత్‌కు ఫాలోఆన్‌ ఇచ్చే అవకాశమున్నా బౌలర్ల అలసటను దృష్టిలో ఉంచుకుని ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించాలని నిర్ణయించింది. అయితే 241 పరుగుల భారీ ఆధిక్యంతో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లాండ్‌కు అశ్విన్ ఆదిలోనే షాక్ ఇచ్చాడు. తొలి బంతికే బర్న్స్‌(0)ను ఔట్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ 1/1తో లంచ్‌ విరామానికి వెళ్లింది. అనంతరం పర్యాటక జట్టు వేగంగా పరుగులు చేయడానికి ప్రయత్నించింది. కానీ భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్టును దెబ్బతీశారు.

మరోవైపు సహచరులు వెనుదిరుగుతున్నా రూట్ బౌండరీలు బాదుతూ స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. అయితే రూట్‌ను బుమ్రా వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో ఇంగ్లాండ్ టీ విరామానికి 119/5తో నిలిచింది. తర్వాత పోప్‌ (28), బట్లర్ (24) జాగ్రత్తగా ఆడుతూ వికెట్ల పతనాన్ని కాసేపు అడ్డుకున్నారు. కానీ నదీమ్‌ (2/66) వారిద్దరిని ఎక్కువసేపు క్రీజులో ఉండనివ్వలేదు. అనంతరం అశ్విన్ చివరి మూడు వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ను ముగించాడు.


ప్చ్‌..రోహిత్

420 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఓపెనర్లు ఆత్మవిశ్వాసంతో ఇన్నింగ్స్‌ ఆరంభించారు. రోహిత్ శర్మ పుల్‌షాట్‌తో సిక్సర్‌ బాది మంచి లయలో కనిపించాడు. గిల్ బౌండరీలతో ఫామ్‌లో ఉన్నట్లు సంకేతాలిచ్చాడు. కానీ లీచ్ చక్కని బంతితో రోహిత్‌ను క్లీన్‌బౌల్డ్ చేసి టీమిండియాకు షాకిచ్చాడు. అనంతరం వన్‌డౌన్‌లో వచ్చిన పుజారాతో కలిసి గిల్ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ నాలుగో రోజు ఆటను ముగించాడు.

స్కోరు వివరాలు

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌: 578 ఆలౌట్‌

భారత్ తొలి ఇన్నింగ్స్‌: 337 ఆలౌట్‌

ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌: 178 ఆలౌట్‌

భారత్ రెండో ఇన్నింగ్స్‌: 39/1

ఇదీ చదవండి

కోహ్లీ 1 లేదా 2 సెంచరీలు కొడతాడు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని