బుమ్రాను టీమ్‌ఇండియా ఎప్పుడూ ప్రశ్నించలేదు!
close

తాజా వార్తలు

Published : 19/03/2021 01:54 IST

బుమ్రాను టీమ్‌ఇండియా ఎప్పుడూ ప్రశ్నించలేదు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: జట్టు యాజమాన్యం వేధింపుల వల్లే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికానని పాక్‌ మాజీ పేసర్‌ మహ్మద్‌ ఆమిర్‌ అన్నాడు. జట్టు యాజమాన్యం పనితీరు ఎలావుండాలో చెప్పేందుకు అతడు జస్ప్రీత్‌ బుమ్రా వ్యవహారం ఉదహరించాడు. వికెట్లు తీయనప్పుడు టీమ్‌ఇండియా అతడిని ఒక్కసారీ ప్రశ్నించలేదన్నాడు. అవసరమైన సమయంలో అండగా నిలబడిందని పేర్కొన్నాడు.

‘నాలుగైదు మ్యాచులకే ఆటతీరును సమీక్షించడం మంచి వైఖరి కాదని నా అభిప్రాయం. మీకు గుర్తుందా? ఆస్ట్రేలియాలో ఆడుతున్నప్పుడు జస్ప్రీత్‌ బుమ్రా 16 మ్యాచుల్లో ఒక వికెట్టే తీశాడు. కానీ అప్పుడెవరూ అతడిని ప్రశ్నించలేదు. ఎందుకంటే అతడు మ్యాచులను గెలిపించగల బౌలరని తెలుసు. అది జట్టు యాజమాన్యం అండగా నిలవాల్సిన సమయం. భారత్‌ అచ్చం అలాగే చేసింది’ అని ఆమిర్‌ అన్నాడు.

‘ఒక ఆటగాడు రాణించకుంటే చేయాల్సింది అతడిని ప్రోత్సహించడం. జట్టు నుంచి తొలగించడం కాదు. ఇదిలాగే ఉంటే జట్టు మొత్తం క్రిస్టియానో రొనాల్డో తరహా ఆటగాళ్లతోనే నింపాలి. అప్పుడే మీరు నింపాదిగా ఉండగలరు. జట్టు సభ్యులతో నాకెలాంటి ఇబ్బందులు లేవు. వారు నాకన్నా ముందుగా వచ్చినవారంతే. నాకున్న అన్ని ఐచ్ఛికాలను పరిశీలించాకే వీడ్కోలు నిర్ణయం తీసుకున్నా. టెస్టు క్రికెట్‌కు దూరమైనప్పుడు వారన్న మాటలు నన్నెంతో గాయపరిచాయి. నేనిప్పుడు క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నాను. కుటుంబంతో సమయం గడుపుతున్నాను. వీడ్కోలును వెనక్కి తీసుకొనే ఉద్దేశమైతే ఇప్పటికి లేదు’ అని ఆమిర్‌ తెలిపాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని