రూట్‌ ఆ రికార్డులన్నింటినీ కొట్టేసెయ్‌..!
close

తాజా వార్తలు

Updated : 11/02/2021 07:37 IST

రూట్‌ ఆ రికార్డులన్నింటినీ కొట్టేసెయ్‌..!

లండన్‌: స్పిన్‌ను బాగా ఆడే తమ దేశ అత్యుత్తమ ఆటగాడు రూట్‌ అని, టెస్టుల్లో ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌ రికార్డులన్నీ అతను బద్దలుకొడతాడని మాజీ కెప్టెన్‌ నాసిర్‌ హుస్సేన్‌ అభిప్రాయపడ్డాడు. స్పిన్‌కు సహకరించే చెపాక్‌ పిచ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో రూట్‌ ద్విశతకం బాదిన సంగతి తెలిసిందే. ‘‘ఇంగ్లాండ్‌ దిగ్గజ ఆటగాళ్లలో కచ్చితంగా రూట్‌ ఒకడు. బహుశా అన్ని ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌ రికార్డులను అతను బద్దలు కొడతాడని అనుకుంటున్నా. అలిస్టర్‌ కుక్‌ పేరిట ఉన్న 161 మ్యాచ్‌ల రికార్డును, అత్యధిక పరుగులనూ దాటేసే వీలుంది. రూట్‌కు ఇప్పుడు 30 ఏళ్లే. ఆల్‌టైమ్‌ ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌ దిగ్గజాల జాబితాలో కుక్, గ్రహమ్‌ గూచ్, పీటర్సన్‌ సరసన రూట్‌ ఉంటాడు. స్పిన్‌ను ఆడడంలో అతనే అత్యుత్తమం. అతనాడే స్వీప్‌ షాట్లు చూసేందుకు రెండు కళ్లు చాలవు’’ అని హుస్సేన్‌ అన్నాడు. భారత్‌తో తొలి టెస్టులో పూర్తిస్థాయి ప్రదర్శనతో ఇంగ్లాండ్‌ గెలిచిందని అతనన్నాడు. తమ బౌలర్లకు విశ్రాంతినిచ్చి, వాళ్ల నుంచి పూర్తి స్థాయి ప్రదర్శన రాబట్టేందుకు రూట్‌.. తొలి టెస్టులో భారత్‌కు ఫాలోఆన్‌ ఆడే అవకాశం ఇవ్వలేదని హుస్సేన్‌ చెప్పాడు.  

ఇవీ చదవండి..
‘ఇదిగో.. ఈ యెటకారాలే వద్దనేది వాన్‌’
టాస్‌ ఓడితే ఇంగ్లాండ్‌ పని అంతే..!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని