అయ్యో..! బెన్‌స్టోక్స్‌కు అంపైర్ల మందలింపు

తాజా వార్తలు

Published : 27/03/2021 01:39 IST

అయ్యో..! బెన్‌స్టోక్స్‌కు అంపైర్ల మందలింపు

పుణె: ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ తన అలవాటును మర్చిపోలేక పోతున్నాడు. బంతికి ఉమ్ము రాస్తూ మరోసారి దొరికిపోయాడు. అంపైర్ల ఆగ్రహానికి గురయ్యాడు. టీమ్‌ఇండియాతో జరుగుతున్న రెండో వన్డేలో నాలుగో ఓవర్‌ను టాప్లే వేశాడు. రెండో బంతి తర్వాత స్టోక్స్‌ మర్చిపోయి ఆ బంతికి లాలాజలం రుద్దాడు. దీనిని గమనించిన అంపైర్లు నితిన్‌ మేనన్‌, వీరేందర్‌ శర్మ ఇంగ్లాండ్‌ తాత్కాలిక సారథి జోస్‌ బట్లర్‌ను పిలిచి హెచ్చరించారు. బంతిని శానిటైజ్‌ చేసి ఆటను తిరిగి ఆరంభించారు.

స్టోక్స్‌ బంతికి ఉమ్ము రుద్దడం ఇదే తొలిసారి కాదు. ఇదే పర్యటనలో గులాబి టెస్టులో బంతికి లాలాజలం రుద్దుతూ దొరికిపోయాడు. కాగా రెండో వన్డేలో ఉమ్మి రుద్దిన ఓవర్లోనే శిఖర్‌ ధావన్‌ క్యాచ్‌ను స్టోక్స్‌ అందుకోవడం గమనార్హం. కొవిడ్‌-19 వల్ల బంతిపై లాలాజలం రుద్దడాన్ని ఐసీసీ నిషేధించింది. ఎవరైనా అలా రుద్దితే అంపైర్లు శానిటైజ్‌ చేసిన తర్వాతే బంతిని ఇస్తారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని