close

తాజా వార్తలు

Published : 08/04/2021 17:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

శ్రేయస్‌.. శస్త్రచికిత్స పూర్తి

ముంబయి: టీమ్‌ఇండియా యువ క్రికెటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ శస్త్రచికిత్స విజయవంతమైంది. స్థానభ్రంశమైన అతడి భుజానికి వైద్యులు చికిత్స చేశారు. ఈ నేపథ్యంలో అతి త్వరలోనే అందరి ముందుకు వస్తానని అతడు ధీమా వ్యక్తం చేశాడు. ‘శస్త్రచికిత్స విజయవంతమైంది. నేను పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. త్వరలోనే మీ ముందుకొస్తాను. మీ సందేశాలకు కృతజ్ఞతలు’ అని శ్రేయస్‌ ట్వీట్‌ చేశాడు.

ఇంగ్లాండ్‌తో వన్డే సిరీసులో శ్రేయస్‌ గాయపడ్డాడు. ఫీల్డింగ్‌ చేస్తూ బంతిని అందుకొనే క్రమంలో కిందపడ్డాడు. అతడి భుజం స్థానభ్రంశం కావడంతో విలవిల్లాడుతూ మైదానం వీడాడు. ఫలితంగా అతడు ఆ సిరీసుకే కాకుండా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ పూర్తి సీజన్‌కు దూరం కావాల్సి వచ్చింది. శస్త్రచికిత్స చేయించుకోవడంతో అయ్యర్‌ కనీసం నాలుగు నెలలు మైదానానికి దూరం కావాల్సి ఉంటుంది. ఫలితంగా లాంకాషైర్‌తో ఒప్పందం సందిగ్ధంలో పడింది. శ్రేయస్‌ లేకపోవడంతో దిల్లీ క్యాపిటల్స్‌కు రిషభ్ పంత్‌ సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.



ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని