WTC Finalకు ముందు ఉల్లాసంగా.. ఉత్సాహంగా!
close

తాజా వార్తలు

Updated : 18/06/2021 11:43 IST

WTC Finalకు ముందు ఉల్లాసంగా.. ఉత్సాహంగా!

మయాంక్‌ జుట్టు దువ్విన ఇషాంత్‌.. సరదాగా ఫొటోషూట్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు భారత్, న్యూజిలాండ్‌ సన్నద్ధమయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం ఫైనల్లో తలపడనున్నాయి. విరాట్‌ కోహ్లీ, కేన్‌ విలియమ్సన్‌.. సారథులుగా ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ ట్రోఫీ గెలవలేదు. ఈ నేపథ్యంలో అరంగేట్రం ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో గెలిచి ఆ కొరత తీర్చుకోవాలని భావిస్తున్నారు. మరికొన్ని గంటల్లో మ్యాచ్‌ మొదలవ్వనుంది. ఈ సందర్భంగా రెండు జట్ల ఆటగాళ్ల ఫొటోషూట్‌ వీడియోను ఐసీసీ ట్వీట్‌ చేసింది. సందడి సందడిగా ఆటగాళ్లంతా అందులో పాల్గొనడం విశేషం.

ఇషాంత్‌ శర్మ పోజులిస్తున్నప్పుడు ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ నవ్వుతూ కనిపించాడు. అతడు భంగిమలు పెట్టిన ప్రతిసారీ బిగ్గరగా నవ్వాడు. అంతేకాకుండా మయాంక్‌ జుట్టును లంబూ దువ్వడం గమనార్హం. ఇంక జస్ప్రీత్‌ బుమ్రా, రోహిత్‌ శర్మ, అజింక్య రహానె, విరాట్‌కోహ్లీ, శుభ్‌మన్‌గిల్‌ కెమెరాకు చక్కని పోజులిచ్చారు. న్యూజిలాండ్‌ ఆటగాళ్లు సైతం ఆనందంగా షూట్‌లో పాల్గొనడం గమనార్హం.

ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ను మరో సాధారణ మ్యాచ్‌గా భావిస్తున్నామని టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ చెప్పిన సంగతి తెలిసిందే. ఎప్పటిలాగే ఈ మ్యాచును ఆడతామని, మరీ అతి ప్రాధాన్యం ఇవ్వడం లేదని తెలిపాడు. ఇందులో గెలిచినా, ఓడినా క్రికెట్‌ ప్రపంచం ఆగిపోదని స్పష్టం చేశాడు. వాతావరణం వల్ల తమ జట్టు కూర్పులో పెద్దగా మార్పులేమీ చోటు చేసుకోలేదని వెల్లడించాడు.




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని