స్మిత్‌ ఛీటర్‌ కాదు: ఆసీస్‌ కెప్టెన్‌ 
close

తాజా వార్తలు

Updated : 12/01/2021 13:30 IST

స్మిత్‌ ఛీటర్‌ కాదు: ఆసీస్‌ కెప్టెన్‌ 

రిషభ్‌పంత్‌ గార్డ్‌ చెరిపేయలేదు

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టు చివరి రోజు స్టీవ్‌స్మిత్‌.. టీమ్ఇండియా యువ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌పంత్‌(97; 118 బంతుల్లో 12x4, 3x6) చేసుకున్న బ్యాటింగ్‌ గార్డ్‌ మార్క్‌ను చేరిపేసి మరోసారి విమర్శల పాలయ్యాడు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌ కావడంతో ఇంకా తన దుర్బుద్ధిని మార్చుకోలేదని నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే, స్మిత్‌ అలా చేయలేదని కెప్టెన్‌ టిమ్‌పైన్‌ వెనకేసుకొచ్చాడు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆస్ట్రేలియా కెప్టెన్‌.. టెస్టుల్లో స్మిత్‌ తరచూ క్రీజు వద్దకెళ్లి తాను బ్యాటింగ్‌ చేస్తున్నట్లు ఊహించుకుంటాడని చెప్పాడు. ఈ క్రమంలోనే తనకు అనుకూలంగా గార్డ్‌ మార్క్‌ను మార్చుకుంటాడని పేర్కొన్నాడు.

‘ఈ విషయంపై నేను స్మిత్‌తో మాట్లాడాను. అయితే, ఆ వీడియో మరో విధంగా వైరల్‌ కావడంతో అతడు బాధపడుతున్నాడు. స్మిత్‌ టెస్టు క్రికెట్‌ ఆడటం మీరు చూస్తే ప్రతీ మ్యాచ్‌లో రోజుకు ఐదారు సార్లు అలా చేస్తాడు. అయితే, ఈ మ్యాచ్‌లో పంత్‌ గార్డ్‌ మార్క్‌ను అతడు చెరిపేయలేదు. ఒకవేళ అలా చేసినా టీమ్‌ఇండియా దీనిపై ఫిర్యాదు చేసేది. కానీ, చేయలేదు. అయితే, స్మిత్‌ అలా క్రీజు వద్దకెళ్లి అతడే బ్యాటింగ్‌ చేస్తున్నట్లు గార్డ్‌ మార్క్‌ను మార్చుకోవడం నేను చాలాసార్లు చూశాను’ అని పైన్‌ పేర్కొన్నాడు.

సోమవారం 98/2 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో చివరిరోజు రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ ఆదిలోనే కెప్టెన్‌ రహానె(4) వికెట్‌ కోల్పోయింది. అనంతరం వచ్చిన పంత్‌ ధాటిగా ఆడి ఆసీస్‌ బౌలర్లపై ఒత్తిడి తెచ్చాడు. ఈ క్రమంలోనే తొలిసెషన్‌లో డ్రింక్స్‌ బ్రేక్స్‌ సందర్భంగా స్మిత్‌ బ్యాటింగ్‌ క్రీజు వద్దకు వచ్చి పంత్‌ చేసుకున్న మార్క్‌ను చెరిపేశాడు. అదంతా బెయిల్స్‌ కెమెరాకు చిక్కడంతో విషయం బయటకు పొక్కింది. దాంతో అతడిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇక 2018లో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ సందర్భంగా అప్పటి కెప్టెన్‌గా ఉన్న స్మిత్‌ బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే. అప్పుడు వార్నర్‌, బాన్‌క్రాఫ్ట్‌తో సహా ఏడాది పాటు నిషేధానికి గురయ్యాడు.

ఇవీ చదవండి..
‘డ్రా’ కానే కాదిది.. ఆసీస్‌ పొగరుకు ఓటమి!
నా మాటలతో తప్పుడు సంకేతాలిచ్చా.. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని