close

తాజా వార్తలు

Published : 08/04/2021 14:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆర్సీబీ అప్పుడూ ఇంతే.. ఇప్పుడూ అంతే:కోహ్లీ

యువ క్రికెటర్లతో ఆర్సీబీ కెప్టెన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: రేపటి నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తొలిపోరులో తలపడనున్నాయి. అయితే, ఆర్సీబీ ఆటగాళ్లందరూ క్వారంటైన్‌ గడువు పూర్తి చేసుకోవడంతో ప్రాక్టీస్‌కు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ బుధవారం జట్టు సభ్యులతో మాట్లాడాడు. కొత్తగా ఈ ఏడాది జట్టులోకి వచ్చిన వారికి స్వాగతం పలుకుతూ వారి నుంచి తనకేం కావాలో వివరించాడు.

‘ఆర్సీబీలో చేరిన కొత్త కుర్రాళ్లందరికీ ఈ అద్భుత బృందంలోకి స్వాగతం. గతంలో ఈ జట్టులో ఆడిన ఆటగాళ్ల నుంచి ఇక్కడెలా ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది. ఈ వాతావరణం, ఈ జోష్‌ సీజన్ మొత్తం ఇలాగే ఉంటుంది. నేను మీ నుంచి ఆశించేది ఒకేఒక్క విషయం. అదేమిటంటే.. మైదానంలోనే ఎక్కువ సమయం గడపడం. అది ప్రాక్టీస్ సెషన్స్ అయినా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మీరు సంపూర్ణ ఆసక్తి చూపిస్తారని నేను ఆశిస్తున్నా. మేం ఎప్పుడూ ఇలాగే ఉంటాం. ఇదెప్పుడూ మారదు’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

‘అలాగే గతేడాది మేం చాలా బాగా ఆస్వాదించాం. ముఖ్యంగా ప్రాక్టీస్‌ సెషన్స్‌లో వినోదంతో పాటు ఎంతో కష్టపడ్డాం. ఎవరూ డుమ్మా కొట్టడం కానీ, సమయం వృథా చేయడం కానీ జరగలేదు. మేం ప్రొఫెషనల్‌ క్రికెటర్లము కాబట్టి మాకేం కావాలనే విషయంపై స్పష్టంగా ఉన్నాం. అలాగే మంచి వినోదం కూడా దొరికింది. ఇప్పుడు మిమ్మల్ని.. నేను, జట్టు యాజమాన్యం నమ్ముతోంది. ఆర్సీబీకి ఏం కావాలో అది సాధించడానికి మీరు కృషి చేస్తారని భావిస్తున్నాం. మీకేం కావాలన్నా నాతో పాటు జట్టు యాజమాన్యం అండగా ఉంటుంది. ఈ సీజన్‌లో మనమంతా ఒక నమ్మకంతో ఉంటే కచ్చితంగా అద్భుతాలు సృష్టిస్తాం. అందుకోసం అందరూ సిద్ధంగా ఉండాలి. నేను కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నా. కాబట్టి మనం ఈ టోర్నీని శుభారంభంతో ప్రారంభిద్దాం’ అని కోహ్లీ పేర్కొన్నాడు. కాగా, గతేడాది జట్టులోని సభ్యుల్లో ఆర్సీబీ ఈ సారి పది మందిని తొలగించిన సంగతి తెలిసిందే. అలాగే వేలంలో మాక్స్‌వెల్‌ వంటి కీలక ఆల్‌రౌండర్‌ను కొనుగోలు చేసింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ సీజన్‌లోనైనా కోహ్లీసేన అద్భుతం చేస్తుందో లేదో వేచి చూడాలి.ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని