రికార్డులతో చెలరేగిన కోహ్లీ

తాజా వార్తలు

Updated : 15/03/2021 08:34 IST

రికార్డులతో చెలరేగిన కోహ్లీ

రెండో టీ20లో సత్తా చాటిన కెప్టెన్‌

అహ్మదాబాద్‌ : పొట్టి సిరీస్‌ తొలి మ్యాచ్‌లో ఓటమి చవి చూసిన టీమ్‌ఇండియా.. రెండో మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆ లెక్కసరిచేసింది. మొతేరాలో జరిగిన రెండో టీ20లో ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను కోహ్లీ సేన చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ 20 ఓవర్లలో  6 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఛేదనలో సారథి కోహ్లీ ఎట్టకేలకు సత్తా చాటి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కోహ్లీ (73 నాటౌట్‌; 49 బంతుల్లో 5×4, 3×6), అరంగేట్ర ఓపెనర్‌ ఇషాన్‌ (56; 32 బంతుల్లో 5×4, 4×6) అర్ధశతకాలతో రాణించారు.

ఇక పరుగుల యంత్రం కోహ్లీ ఈ మ్యాచ్‌ ద్వారా నమోదు చేసిన రికార్డులివి..

టీ20ల్లో మూడు వేల పరుగులు సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా కోహ్లి రికార్డు సృష్టించాడు.

> అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 12 వేల పరుగుల మైలురాయి చేరుకున్న కెప్టెన్‌గా నిలిచాడు. 226 ఇన్నింగ్స్‌ల్లోనే కోహ్లీ ఆ ఘనత సాధించాడు.

టీ20ల్లో అత్యధిక అర్ధ శతకాలు నమోదు చేసిన ఆటగాడిగా కోహ్లీ(26) రికార్డు సృష్టించాడు. ఆ తర్వాతి స్థానాల్లో  రోహిత్‌ (25), గప్తిల్‌ (19) ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని