నిజమే.. కానీ సెలక్టర్లను నిందించొద్దు యువీ!
close

తాజా వార్తలు

Published : 04/08/2020 14:57 IST

నిజమే.. కానీ సెలక్టర్లను నిందించొద్దు యువీ!

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌ సింగ్‌ను సెలక్టర్లు సరైన సమయంలోనే విస్మరించారని మాజీ ఆటగాడు రోజర్‌ బిన్ని అన్నారు. సెలక్టర్లు జట్టు మొత్తాన్ని దృష్టిలో పెట్టుకుంటారని పేర్కొన్నారు. కెరీర్‌ చివరి దశలో సరైన ప్రోత్సాహం లభించలేదని అతడు ఎవరినీ నిందించకూడదని సూచించారు. జహీర్‌, సెహ్వాగ్‌, లక్ష్మణ్ వంటి దిగ్గజాలతోనూ ఇలాగే వ్యవహరించారని యువీ విమర్శించడంపై బిన్నీ స్పందించారు.

‘యువరాజ్‌ అద్భుతమైన ప్రతిభాశాలి. అంతర్జాతీయ క్రికెట్లో తన తరంలో అతడు బంతిని చక్కగా బాదేవాడు. అతడి కెరీర్‌ సైతం సవ్యంగానే సాగింది. యువతరానికి చోటివ్వాలనే దృష్టితోనే సెలక్టర్లు అతడిని సరైన సమయంలో పక్కనపెట్టారు’ అని బిన్ని అన్నారు. 2017 తర్వాత యువీకి టీమ్‌ఇండియాలో చోటు దక్కలేదు. ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత అతడిని సెలక్టర్లు విస్మరించారు. దాంతో 2019, ప్రపంచకప్‌ సమయంలో ఆఖరి మ్యాచ్‌ ఆడకుండానే అతడు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.

‘ఇంకా ఆడగలమని వారంతా అనుకోవచ్చు. కానీ సెలక్టర్లు మాత్రం కఠినంగానే ఉంటారు. అలాగని వారిని నిందించొద్దు. జట్టు మొత్తాన్ని వారు పరిగణనలోకి తీసుకుంటారు. జట్టుకు కెప్టెన్‌ ప్రధానం. ప్రతి దానికీ అతడే జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే ఐదుగురు సెలక్టర్లు, కెప్టెన్‌ ఎంతో శ్రమిస్తారు. కెరీర్‌ చివర్లో గతంలో మాదిరిగా యువీ ఆడలేకపోయాడు. ఫిట్‌నెస్‌ స్థాయి తక్కువగానే ఉంది. గతంలో బాగా ఆడాడు కాబట్టి ఇంకా మరికొన్ని రోజులు ఆడగలనని యువీ భావించి ఉండొచ్చు’ అని బిన్ని పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని