డాన్స్‌తో అదరగొట్టిన యూజీ సతీమణి

తాజా వార్తలు

Published : 21/01/2021 02:29 IST

డాన్స్‌తో అదరగొట్టిన యూజీ సతీమణి

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా మణికట్టు మాంత్రికుడు యుజ్వేంద్ర చాహల్‌ సోషల్‌ మీడియాలో విపరీతంగా హల్‌చల్‌ చేస్తుంటాడు. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ సహా ఏ ఆటగాడు సోషల్‌ మీడియాలో సంగతులు పంచుకున్నా వెంటనే ట్రోల్‌ చేస్తుంటాడు. అల్లరి చేష్టలతో కవ్విస్తుంటాడు. మ్యాచులు ఏవైనా ముగియగానే చాహల్‌ టీవీ అంటూ క్రికెటర్లను యూజీ ఇంటర్వ్యూ చేసే సంగతి తెలిసిందే.

యూజీ సతీమణి ధనశ్రీ వర్మ సైతం యూట్యూబర్‌గా వెరీ ఫేమస్‌! డ్యాన్సర్‌గా ఆమెకు మంచి పేరుంది. ఆమె యూట్యూబ్‌ ఛానల్‌కు లక్షల్లో సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఇక సోషల్‌ మీడియాలోనూ ఆమె ఎంతో చురుకుగా ఉంటుంది. అభిషేక్‌ బచ్చన్‌ నటించిన బ్లఫ్‌మాస్టర్‌ చిత్రంలోని బురోబురో పాటకు ధనశ్రీ డ్యాన్స్‌ చేసింది. అద్భుతమైన స్టెప్పులతో అదరగొట్టింది. ఆ వీడియోను ఇన్‌స్టాలో పంచుకోగా వేలల్లో లైకులు లభిస్తున్నాయి. దాంతో ఇది వైరల్‌గా మారింది. డిసెంబర్లో పెళ్లిచేసుకున్న యూజీ, ధనశ్రీ దుబాయ్‌లో హనీమూన్‌కు వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి తిరిగొచ్చాక ఎంఎస్‌ ధోనీ, సాక్షి దంపతుల ఇంటికి అతిథులుగా వెళ్లి సందడి చేశారు.

ఇవీ చదవండి
ప్రపంచమంతా సెల్యూట్ చేస్తోంది: రవిశాస్త్రి
మేం వస్తున్నాం.. టీమిండియా కాస్త జాగ్రత్త!

 

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని