Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 219009225
            [news_title_telugu_html] => 

ఇక దక్షిణాఫ్రికాతో..

[news_title_telugu] => ఇక దక్షిణాఫ్రికాతో.. [news_title_english] => [news_short_description] => క్రికెట్‌ అభిమానులకు మరింత వినోదం. కరీబియన్‌ గడ్డపై అదిరే ప్రదర్శన చేసిన టీమ్‌ ఇండియా ఇక సొంతగడ్డపై అలరించనుంది. అదే జోరును కొనసాగించాలనే ఉత్సాహంతో ఉన్న కోహ్లీసేన.. టీ20, టెస్టు ఫార్మాట్లలో దక్షిణాఫ్రికాతో పోరుకు సిద్ధమైంది. ఆదివారం నుంచే పొట్టి సిరీస్‌. ఆ తర్వాత జరిగే టెస్ట్‌ సిరీస్‌ కోసం సెలక్షన్‌ కమిటీ గురువారం జట్టును ప్రకటించనుంది. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [news_sections] => ,4, ) )
ఇక దక్షిణాఫ్రికాతో.. - EENADU
close

ఇక దక్షిణాఫ్రికాతో..

సొంతగడ్డపై సమరానికి టీమ్‌ ఇండియా సై
ఆదివారం నుంచి టీ20 సిరీస్‌
టెస్టు జట్టు ఎంపిక నేడు

క్రికెట్‌ అభిమానులకు మరింత వినోదం. కరీబియన్‌ గడ్డపై అదిరే ప్రదర్శన చేసిన టీమ్‌ ఇండియా ఇక సొంతగడ్డపై అలరించనుంది. అదే జోరును కొనసాగించాలనే ఉత్సాహంతో ఉన్న కోహ్లీసేన.. టీ20, టెస్టు ఫార్మాట్లలో దక్షిణాఫ్రికాతో పోరుకు సిద్ధమైంది. ఆదివారం నుంచే పొట్టి సిరీస్‌. ఆ తర్వాత జరిగే టెస్ట్‌ సిరీస్‌ కోసం సెలక్షన్‌ కమిటీ గురువారం జట్టును ప్రకటించనుంది.

ముంబయి

ధనాధన్‌ క్రికెట్‌కు వేళైంది. ముందుగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత జట్టు డికాక్‌ నేతృత్వంలోని దక్షిణాఫ్రికాను ఢీకొట్టనుంది. ఆదివారం ధర్మశాలలో తొలి మ్యాచ్‌ జరగనుంది. విండీస్‌ను అలవోకగా ఓడించిన భారత జట్టు ఈ సిరీస్‌లో ఎలా ఆడుతుందన్నది ఆసక్తికరం. సాధారణంగా ధర్మశాల పిచ్‌ పేసర్లకు మంచి సహకారాన్నే ఇస్తుంది. కానీ సీనియర్‌ ఫాస్ట్‌ బౌలర్లు జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌లకు భారత్‌ ఈ సిరీస్‌ నుంచి విశ్రాంతినిచ్చింది. అయితే అదే సమయంలో దక్షిణాఫ్రికాకు కాగిసో రబాడ అందుబాటులో ఉన్నాడు. అతడికి తోడు జూనియర్‌ డలా భారత బ్యాట్స్‌మెన్‌ను పరీక్షించనున్నాడు. టీ20 మ్యాచ్‌లకు క్యురేటర్‌ బ్యాటింగ్‌ అనుకూల పిచ్‌లు రూపొందించాలని అంతా భావిస్తారు. కానీ అది సాధ్యమయ్యేలా లేదు. హిమాచల్‌ప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌పీసీఏ) మైదానంలో జరిగే తొలి మ్యాచ్‌కు వాన ముప్పు పొంచి ఉంది. కొన్ని రోజుల ముందు నుంచే వర్ష సూచనలు ఉన్నాయి. పిచ్‌ను ఎక్కువ సమయం కవర్లతో కప్పి ఉంచితే, ఎండ తగలకపోతే ఫాస్ట్‌ బౌలర్లకు మరింత సహకారం లభించవచ్చు.

దక్షిణాఫ్రికా టీ20 జట్టు: డికాక్‌, డసెస్‌, బవుమా, జూనియర్‌ డలా, బోర్న్‌ ఫార్టిన్‌, బ్యురాన్‌ హెండ్రిక్స్‌, రెజా హెండ్రిక్స్‌, మిల్లర్‌, అన్రిచ్‌ నోర్జె, ఫెలుక్వాయో, ప్రిటోరియస్‌, రబాడ, శాంసి, జార్జ్‌ లిండె.

భారత జట్టు: విరాట్‌ కోహ్లి, ధావన్‌, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీష్‌ పాండే, రిషబ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్య, వాషింగ్టన్‌ సుందర్‌, కృనాల్‌ పాండ్య, రవీంద్ర జడేజా, దీపక్‌ చాహర్‌, రాహుల్‌ చాహర్‌, ఖలీల్‌ అహ్మద్‌, నవ్‌దీప్‌ సైని.

రాహుల్‌కు చోటుందా?

దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ గురువారం 15 మంది సభ్యుల భారత జట్టును ప్రకటించనుంది. అందరి దృష్టీ పేలవ ఫామ్‌లో ఉన్న కేఎల్‌ రాహుల్‌పైనే. అజింక్య రహానె, హనుమ విహారి ఐదు, ఆరో స్థానాల్లో నిలదొక్కుకున్న నేపథ్యంలో రోహిత్‌ శర్మను ఓపెనర్‌గా ప్రయత్నించవచ్చని భావిస్తున్నారు. 2018లో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా రోహిత్‌ తన చివరి టెస్ట్‌ మ్యాచ్‌ ఆడాడు. రాహుల్‌ ఫామ్‌ కారణంగా అతడి అవకాశాలు మెరుగవుతున్నాయి. విండీస్‌ పర్యటనలో రోహిత్‌ జట్టులో ఉన్నా ఆడే అవకాశం రాని సంగతి తెలిసిందే. ఇప్పుడు అలాంటి పరిస్థితి రాహుల్‌కు ఎదురుకావొచ్చు. అసలు అతణ్ని సెలక్టర్లు జట్టుకు ఎంపిక చేస్తారా అన్న సందేహాలు కూడా ఉన్నాయి. వెస్టిండీస్‌పై మయాంక్‌ అగర్వాల్‌తో కలిసి రాహుల్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించాడు. ఇప్పుడు ఓపెనింగ్‌ స్థానం కోసం శుభ్‌మన్‌ గిల్‌ (పంజాబ్‌), ప్రియాంక్‌ పంచల్‌ (గుజరాత్‌) కూడా పోటీపడుతున్నారు. అయితే రాహుల్‌ను తప్పించాలని సెలక్టర్లు నిర్ణయిస్తే.. దేశవాళీ క్రికెట్లో, భారత్‌-ఎ తరఫున విశేషంగా రాణిస్తున్న బంగాల్‌ ఓపెనర్‌ అభిమన్యు ఈశ్వరన్‌ రిజర్వ్‌ ఓపెనర్‌గా ఎంపిక కావొచ్చని భావిస్తున్నారు. పూర్తిగా ఫిట్‌నెస్‌ సాధించని పేస్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ జట్టుకు దూరం కావొచ్చు. విండీస్‌ పర్యటనలో లేని ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య పునరాగమనం చేయనున్నాడు. పేస్‌ బౌలర్‌ షమికి విశ్రాంతినిస్తే ఉమేశ్‌ యాదవ్‌కు అవకాశం లభిస్తుంది. 

టెస్ట్‌ సిరీస్‌కు జట్టు (అంచనా): మయాంక్‌ అగర్వాల్‌, రోహిత్‌ శర్మ, పుజారా, కోహ్లి, రహానె, హనుమ విహారి, హార్దిక్‌ పాండ్య, రిషబ్‌ పంత్‌, సాహా, బుమ్రా, ఇషాంత్‌, షమి/ఉమేశ్‌ యాదవ్‌, అశ్విన్‌, జడేజా, కుల్‌దీప్‌.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.