close

పీబీఎల్‌ ఫైనల్లో బెంగళూరు 

సెమీస్‌లో అవధెపై విజయం

బెంగళూరు: కీలక మ్యాచ్‌లో బెంగళూరు రాఫ్టర్స్‌ అదరగొట్టింది. కెప్టెన్‌ కిదాంబి శ్రీకాంత్‌, సాయి ప్రణీత్‌ విజయాలు సాధించడంతో ప్రిమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ నాలుగో సీజన్‌లో ఆ జట్టు టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. శుక్రవారం జరిగిన సెమీస్‌లో బెంగళూరు 4-2 తేడాతో అవధె వారియర్స్‌ను ఓడించి ఫైనల్లోకి ప్రవేశించింది. అవధె ట్రంప్‌ మ్యాచ్‌గా ఎంచుకొన్న మిక్స్‌డ్‌ డబుల్స్‌లో క్రిస్టియాన్సెన్‌- అశ్విని పొన్నప్ప జోడీ 15-7, 15-10తో ఎలీస్‌- స్మిత్‌ జంటపై నెగ్గి జట్టుకు శుభారంభాన్ని అందించింది. అయితే ఆ తర్వాత వరుసగా జరిగిన రెండు పురుషుల సింగిల్స్‌ మ్యాచ్‌ల్లో ప్రణీత్‌ 15-9, 15-4తో లీ డాంగ్‌పై, శ్రీకాంత్‌ 15-7, 15-10తో సన్‌ వాన్‌పై గెలిచారు. దాంతో స్కోరు 2-2తో సమమైంది. బెంగళూరు ట్రంప్‌ మ్యాచ్‌గా ఎన్నుకొన్న పురుషుల డబుల్స్‌లో మహమ్మద్‌- హెండ్రా జోడీ 15-14, 15-9తో క్రిస్టియాన్సెన్‌- లీ జంటపై నెగ్గడంతో ఆ జట్టు విజయం ఖరారైంది. శనివారం జరిగే మరో సెమీస్‌లో ముంబయి రాకెట్స్‌తో హైదరాబాద్‌ హంటర్స్‌ తలపడనుంది.

పీబీఎల్‌లో ఈనాడు (సెమీస్‌) 
హైదరాబాద్‌ × ముంబయి (రాత్రి 7 నుంచి)

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.