Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 174947
            [news_title_telugu_html] => 

కరుణరత్నె శతకం

[news_title_telugu] => కరుణరత్నె శతకం [news_title_english] => [news_short_description] => కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నె (122; 243 బంతుల్లో 6×4, 1×6) సెంచరీ సాధించడంతో న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో శ్రీలంక 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 268 పరుగుల ఛేదనలో ఓవర్‌నైట్‌ స్కోరు 133/0తో [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,4, ) )
కరుణరత్నె శతకం - EENADU
close
కరుణరత్నె శతకం

కివీస్‌పై లంక ఘన విజయం

గాలె: కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నె (122; 243 బంతుల్లో 6×4, 1×6) సెంచరీ సాధించడంతో న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో శ్రీలంక 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 268 పరుగుల ఛేదనలో ఓవర్‌నైట్‌ స్కోరు 133/0తో అయిదో రోజు, ఆదివారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన లంకను కరుణరత్నె నడిపించాడు. ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మన్‌ తిరిమానె (64)తో పాటు కుశాల్‌ మెండిస్‌ (10) త్వరగా ఔటైనా.. మాథ్యూస్‌ (28 నాటౌట్‌)తో కలిసి అతను లంకను విజయం దిశగా తీసుకెళ్లాడు. సెంచరీ పూర్తయిన తర్వాత కరుణరత్నె వెనుదిరిగినా.. మాథ్యూస్‌, ధనంజయ డిసిల్వా (14 నాటౌట్‌) తోడుగా జట్టును గెలిపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌ 249 పరుగులు చేయగా, లంక 267 పరుగులకు ఆలౌటైంది. కివీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 285 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌లో లంక 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్టు గురువారం ప్రారంభం కానుంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.