close
27 పరుగులకే మిజోరాం ఆలౌట్‌

హైదరాబాద్‌ ఘనవిజయం

పుదుచ్చేరి: బీసీసీఐ మహిళల అండర్‌-23 టీ20 టోర్నీలో హైదరాబాద్‌ బౌలర్లు చెలరేగారు. సోమవారం మ్యాచ్‌లో మిజోరాం జట్టును 27 పరుగులకే ఆలౌట్‌ చేశారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా ఛేదించి 10 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకున్నారు. ఈ టోర్నీలో హైదరాబాద్‌కిది వరుసగా ఐదో విజయం. ఇప్పటి వరకూ గ్రూప్‌- ఈలో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ జట్టు నెగ్గింది. మొదట బ్యాటింగ్‌ చేసిన మిజోరాం 15.4 ఓవర్లలో 27 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో ఆరుగురు బ్యాటర్లు డకౌట్‌ అవడం విశేషం. ఆ జట్టులో అత్యధిక స్కోరు ఎక్స్‌ట్రాల (10) రూపంలో వచ్చింది. హైదరాబాద్‌ బౌలర్లలో భోగి శ్రావణి (4/4) నాలుగు వికెట్లతో విజృంభించింది. కీర్తిరెడ్డి (2/1), సాయిలేహ (2/7) చెరో రెండు వికెట్లు తీశారు. బదులుగా ఇన్నింగ్స్‌ ఆరంభించిన హైదరాబాద్‌ మూడు ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. రమ్య (18 నాటౌట్‌) లాంఛనాన్ని పూర్తి చేసింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.