close

ప్రధానాంశాలు

సెమీస్‌లో సెంట్రల్‌ ఎక్సైజ్‌ ఫుట్‌బాల్‌ టోర్నీ

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: నవాబ్‌ షుజాత్‌ అహ్మద్‌ఖాన్‌ స్మారక ఫుట్‌బాల్‌ టోర్నీలో సెంట్రల్‌ ఎక్సైజ్‌, హైదరాబాద్‌ గ్లోబ్‌ జట్లు సెమీస్‌లో అడుగుపెట్టాయి. సిటీ కాలేజ్‌ ఓల్డ్‌బాయ్స్‌ సంఘం ఆధ్వర్యంలో కులీ కుతుబ్‌ షా మైదానంలో బుధవారం జరిగిన క్వార్టర్స్‌లో సెంట్రల్‌ ఎక్సైజ్‌ 1-0 తేడాతో ఏజీఓఆర్‌సీపై గెలిచింది. మదన్‌ (42వ నిమిషంలో) గోల్‌ చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. మరో క్వార్టర్స్‌లో హైదరాబాద్‌ గ్లోబ్‌ 2-0తో అబ్బాస్‌ యూనియన్‌పై నెగ్గింది. మహమ్మద్‌ సజ్జద్‌ (7వ నిమిషంలో) గోల్‌తో ఆ జట్టు ఖాతా తెరిచింది. రెండో అర్ధభాగంలో అతను మరో గోల్‌ కొట్టి జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు. శుక్రవారం జరిగే సెమీస్‌ మ్యాచ్‌ల్లో సీసీఓబీతో హైదరాబాద్‌ స్పోర్టింగ్‌, హైదరాబాద్‌ గ్లోబ్‌తో సెంట్రల్‌ ఎక్సైజ్‌ తలపడనున్నాయి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.