
ప్రధానాంశాలు
మారడోనా ఆస్తి ఎవరికి?
వీలునామా రాయని ఫుట్‌బాల్ దిగ్గజం
బ్యూనస్ ఎయిర్స్: గుండెపోటుతో మృతి చెందిన ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా ఆస్తి పంపకాల విషయంలో తగాదాలు, విభేధాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. తన ఆస్తి ఎవరికి, ఎంత చెందాలనే వివరాలతో అతను వీలునామా రాయకుండానే చనిపోవడం అందుకు కారణం. ప్రస్తుతం అతని ఆస్తి విలువ దాదాపు రూ.660 కోట్లుగా ఉంది. తనకు అధికారికంగా ఇద్దరు కూతుళ్లు మాత్రమే ఉన్నట్లు కొన్నేళ్లుగా అతను చెప్పుకుంటున్నప్పటికీ.. బయటకు చెప్పని సంతానం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తన కూతురు గియానియాతో గొడవ సందర్భంగా గతేడాది తన ఆస్తిని మొత్తం సేవా సంస్థలకు రాసిస్తానని మారడోనా చెప్పినప్పటికీ.. అలాంటిదేం చేయలేదు. తన చిన్ననాటి స్నేహితురాలు క్లాడియాను వివాహం చేసుకుని, గియానియాతో పాటు మరో కూతురు దాల్మాకు తండ్రి అయిన తర్వాత అతను.. 2003లో ఆమెకు విడాకులిచ్చాడు. మరోవైపు 1986లోనే ఇటలీ గాయని క్రిస్టియానా ద్వారా అతను డీగో జూనియర్‌కు జన్మనిచ్చాడు. కరోనా బారిన పడడంతో అతను.. మారడోనా అంత్యక్రియలకు హాజరు కాలేకపోయాడు. తన మాజీ ప్రేయసి సెబాలైన్తో సహజీవనం చేసిన మారడోనా 1996లో జానా అనే అమ్మాయి పుట్టడానికి కారణమయ్యాడు. 2013లో మరో ప్రేయసి వెరోనికా ద్వారా డీగో ఒజేడాకు జన్మనిచ్చాడు. వీళ్లే కాకుండా డ్రగ్స్ వ్యసనం నుంచి బయటపడడం కోసం క్యూబాలో గడిపిన సమయంలో మారడోనా కనీసం ముగ్గురు పిల్లలకు తండ్రయ్యాడని అతని న్యాయవాది పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో వీళ్ల మధ్య ఎలాంటి తగాదాలు రాకుండా ఆస్తి పంచడమంటే సవాలే.
ప్రధానాంశాలు
సినిమా
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- సారీ బ్రదర్ నిన్ను కాదు పొడవాల్సింది
- కమల వండితే.. అమెరికా ఆహా అంది
- చరిత్రలో నిలిచే పోరాటమిది: గావస్కర్
- మహా నిర్లక్ష్యం
- అలా చేస్తే భారత్‌దే విజయం: గావస్కర్
- వారెవ్వా సిరాజ్..ఒకే ఓవర్లో రెండు వికెట్లు
- ఓవైపు కవ్వింపులు.. మరోవైపు అరుపులు
- అఫ్గాన్ కార్లకు ‘39’ నంబర్ ఉండబోదు.. ఎందుకంటే?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
