ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్స్‌ ఫైనల్లో సురేఖ బృందం
Array ( ) 1

ప్రధానాంశాలు

Published : 23/09/2021 02:29 IST

ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్స్‌ ఫైనల్లో సురేఖ బృందం

యాంక్టాన్‌ (యుఎస్‌): ప్రపంచ ఆర్చరీ  ఛాంపియన్‌షిప్‌ కాంపౌండ్‌ మహిళల టీమ్‌ విభాగంలో తెలుగమ్మాయి జ్యోతిసురేఖ, ప్రియ గుల్జార్‌, కిరార్‌ ముస్కాన్‌లతో కూడిన భారత జట్టు అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైనల్లో ఏడో సీడ్‌ భారత జట్టు 226-225తో మూడో సీడ్‌ అమెరికా (ఒకోవా, మాకెనా, పియర్స్‌) జట్టుపై విజయం సాధించింది. అంతకుముంద]ు ప్రిక్వార్టర్స్‌లో 235-226తో డెన్మార్క్‌ను సునాయాసంగా ఓడించిన భారత అమ్మాయిలకు క్వార్టర్స్‌లో కఠిన సవాల్‌ ఎదురైంది. రెండో సీడ్‌ బ్రిటన్‌ (లైలా, ఇసాబెలె, ఎలా గిబ్సన్‌)తో హోరాహోరీగా సాగిన ఈ పోరులో స్కోరు 230-230తో సమం కాగా.. షూటాఫ్‌లో   30-28తో భారత్‌ జయకేతనం ఎగురవేసింది. శుక్రవారం ఫైనల్లో సురేఖ బృందం టాప్‌ సీడ్‌ కొలంబియాను ఢీకొంటుంది. సురేఖ ప్రపంచ ఆర్చరీలో ఫైనల్‌ చేరడం ఇది మూడోసారి. వ్యక్తిగత విభాగంలో సురేఖ నేరుగా మూడో రౌండ్లో అడుగుపెట్టింది. అర్హత రౌండ్లో 684 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచిన ఆమెకు తొలి రెండు రౌండ్లలో బై లభించింది. రిషబ్‌ యాదవ్‌, సంగమ్‌ప్రీత్‌, అభిషేక్‌ వర్మలతో కూడిన పురుషుల కాంపౌండ్‌ జట్టు.. క్వార్టర్స్‌లో ఓటమి పాలైంది. ప్రిక్వార్టర్స్‌లో 236-230తో ఇటలీని ఓడించిన భారత జట్టు.. క్వార్టర్స్‌లో 235-238తో ఆస్ట్రియా చేతిలో ఓడింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన