బిగ్‌బాష్‌లో షెఫాలి, రాధ
Array ( ) 1

ప్రధానాంశాలు

Published : 28/09/2021 02:33 IST

బిగ్‌బాష్‌లో షెఫాలి, రాధ

సిడ్నీ: భారత మహిళల క్రికెట్‌ జట్టు స్టార్‌ ఓపెనర్‌ షెషాలి వర్మ, లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ రాధ యాదవ్‌ ఆస్ట్రేలియా దేశవాళీ టీ20 టోర్నీ బిగ్‌బాష్‌ లీగ్‌లో ఆడబోతున్నారు. త్వరలో ఆరంభమయ్యే ఈ టోర్నీలో షెఫాలి, రాధ సిడ్నీ సిక్సర్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. గతేడాది ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో సత్తా చాటిన షెఫాలి.. ప్రస్తుతం పొట్టి ఫార్మాట్లో బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఇంగ్లాండ్‌ దేశవాళీ టోర్నీ ‘ద హండ్రెడ్‌’లో బర్మింగ్‌హామ్‌ తరఫున షెఫాలి ఇటీవలే ఆడింది. తాజాగా ఆస్ట్రేలియాపై చివరి వన్డేలో అర్ధసెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్‌లో ఆడే భారత జట్టులో సభ్యురాలైన రాధ కూడా తొలిసారి బిగ్‌బాష్‌ ఆడబోతోంది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన